Withdraw PF Amount from Umang App at Home: ఈపీఎఫ్ఓలో ఖాతాదారుల సౌకర్యార్ధం చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, అడ్వాన్స్ తీసుకోవడం, పెన్షన్ క్లెయిమ్ ఇలా అన్నీ ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ యాప్ ఉమంగ్ అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు అడ్వాన్స్ లేదా పెన్షన్ క్లెయిమ్ చేసుకునేందుకు లేదా ఇతరత్రా పనులకు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని పీఎఫ్ ఎక్కౌంట్ రన్ చేసుకోవచ్చు. అంటే పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్, వడ్డీ డబ్బులు వివరాలు, లావాదేవీలు, అడ్వాన్స్,పెన్షన్ క్లెయిమ్ చేసుకోవడం అన్నీ ఆన్‌లైన్‌లో లేదా ఉమంగ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా ఈ నామినీ ప్రక్రియ పూర్తి చేయడమే. ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ఉమంగ్ యాప్..పీఎఫ్ సేవలు వినియోగించుకునేందుకు అద్భుతమైన విధానంగా చెప్పవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను ఎప్పటికప్పుడు మొబైల్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు.


ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేసుకోవాలి. లాగిన్ చేసిన తరువాత సర్వీసెస్ సెక్షన్‌లో ఈపీఎఫ్ఓ సేవల్ని ఎంపిక చేసుకోవాలి. ఏ రకమైన సేవలు కావాలో ఎంచుకోవాలి. స్క్రీన్‌పై ఇచ్చిన సూచనలతో లావాదేవీలు ఇతర ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.


Read More: Business From Kitchen: 50 ఏళ్ల వయస్సులో కిచెన్ నుంచి బిజినెస్.. నెలకు 20 లక్షల ఆదాయం


పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం ఎలా


ఉమంగ్ యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ కావాలి. ఈపీఎఫ్ఓ సర్వీసెస్ క్లిక్ చేసి..క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ యూఏఎన్ నెంబర్ , ఓటీపీ నమోదు చేయాలి. ఓటీపీ అనేది రిజిస్టర్ మొబైల్ కు వస్తుంది. అడిగిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అంతే నిర్ణీత వ్యవధిలో మీరు కోరిన డబ్బులు మీ ఎక్కౌంట్‌లో బదిలీ అవుతాయి.


ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓకు చెందిన పీఎఫ్ బ్యాలెన్స్ చెక్, క్లెయిమ్ చేయడం చేయవచ్చు. కేవైసీ వివరాలు అప్ డేట్ చేయవచ్చు. పాస్‌బుక్ చెక్ చేసుకోవచ్చు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వంటి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. కావల్సిన కాగితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also Read: Reserve of Bank India: ప్రింటింగ్ ప్రెస్‌ నుంచి రూ.500 నోట్లు మాయం.. అక్కడ తప్పు జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి