Facebook to shut down face-recognition system: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ రిక‌గ్నీష‌న్ సిస్ట‌మ్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫేస్​బుక్​ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ విభాగ ఉపాధ్యక్షుడు జెరోమ్ పెసెంటి తన బ్లాగులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల మందికిపైగా ఫేస్​బుక్​ యూజ‌ర్ల ఫేషియ‌ల్ డేటాను (Facebook to delete the faceprints) తొలగించనున్నట్లు తెలిపారు. ఫేషియల్​  రికగ్నీషన్​  కోసం ఉపయోగించే.. ఫేస్‌ ప్రింటర్లను కూడా తొలగించనున్నట్లు వివరించారు.


ఈ నిర్ణయం వెనుకున్న కారణాలు అవేనా?


ఫేషియల్ రికగ్నీషన్ ఫిచర్​పై గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సదుపాయం వల్ల ఉపయోగాలకన్నా.. అనర్ధాలే ఎక్కువనే వాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా స్పష్టమైన నిబంధనలను రూపొందించలేకపోతున్నాయి. దీనితో ఈ సదుపాయం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందటూ.. ఇదివరకే చాలా మంది అభ్యంతరం కూడా తెలిపారు.


ఈ కారణాలన్నింటి నేపథ్యంలోనే ఫేస్​బుక్ ఫేషియల్ రికగ్నీషన్ సదుపాయం తొలగించాలని భావిస్తున్నట్లు (Facebook new Changes) తెలుస్తోంది.


Also read: Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే


Also read: Rs.266 Crore Fraud : తెరపైకి మరో మోసం.. ఆ బ్యాంకులో రూ. 266 కోట్ల మోసం!


ఏమిటి ఈ ఫేస్​ రికగ్నీషన్ సిస్టమ్?


ఫేస్​బుక్ యూజర్లు.. ఫేస్​ ప్రింటర్ల ద్వారా తమ ముఖాలను స్కాన్ చేసుకునే సదుపాయం (Facebook face printers) ఉండేది. దీనితో యూజర్ల ఫేషియల్ డేటా సర్వర్లలో నిక్షిప్తం అవుతుంది. దీనితో ఫేస్​బుక్​లో అప్లోడ్​  చేసే ఫొటోలు, వీడియోల్లో ఆ వ్యక్తులు ఎక్కడున్నా (Uses of Facebook face-recognition system) సులభంగా గుర్తించొచ్చు.


ఈ సదుపాయం వాడుకుని మోసాలు జరిగే అవకాశాలున్నాయని.. దీనితో వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని గత కొంత కాలంగా చర్చ సాగుతోంది. ఎట్టకేలకు ఫేస్​బుక్ ఈ సదుపాయాన్నితొలగించేందుకు సిద్ధమైంది.


Also read: Commercial LPG Price Today: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.266 పెంపు.. రూ.2000లకు చేరిన సిలిండర్ ధర


Also read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!


మెటాగా మారాకా.. మరింత కొత్తగా..


ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్​ సహా వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​కు మాతృసంస్థగా ఉన్న ఫేస్​బుక్ పేరు ఇటీవల మెటాగా మారింది. కంపెనీ రీబ్రాండింగ్​లో భాగంగా పేరును మార్చినట్లు (Facebook to Meta) కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్‌)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ మార్క్ జుకర్​ బర్గ్ చెప్పారు. 


దీనితో పాటు.. గత కొన్నాళ్లుగా ఫేస్​బుక్​ పలు వివాదాల్లో (Facebook Disputes) చిక్కుకుని విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో వాటన్నింటి నుంచి తేరుకుని (Facebook rebranding) బ్రాండ్​ను అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ కొత్త పేరు (Why Facebook Change its Name) పెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మెటాగా మారితిన తర్వాత సంస్థ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగమే ఫేస్​ రికగ్నీషన్ సిస్టమ్​ తొలగింపు అని తెలిస్తోంది.


Also read: Microsoft passes Apple: యాపిల్​ను దాటేసి అత్యంత విలువైన లిస్టెడ్​ కంపెనీగా మైక్రోసాఫ్ట్​


Also read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్​ గురించి బిగ్ అప్​డేట్​- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి