JioPhone Next: గూగుల్‌తో కలిసి రిలయన్స్ జియో తీసుకొస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 'జియోఫోన్ నెక్ట్స్' దీపావళి (JioPhone next lauch date) సందర్భంగా దేశీయ మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదేవరకే స్పష్టం చేశారు. తాజాగా రిలయన్స్ జియో కూడా దీనిపై అధికారిక ప్రకటన వెలువరించింది.
జియో ఫోన్ నెక్ట్స్ ధర (JioPhone Next price) సహా ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.
ధర ఎంతంటే?
జియోఫోన్ నెక్ట్స్ ధరను (JioPhone Next price) రూ.6,499గా నిర్ణయించింది కంపెనీ. అయితే అందరికీ స్మార్ట్‌ఫోన్, 4జీ సేవలు అందించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చిన కారణంగా.. (JioPhone next EMI) రూ.1,999 చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా మొత్తాన్ని సులభతర ఈఎంఐలలో చెల్లించొచ్చని వెల్లడించింది. 18/24 నెలల ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించింది.
ఎక్కడ దొరుకుతుంది?
దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ రిటైల్, జియో మార్ట్ డిజిటల్ రిటైర్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందని కంపెనీ వెల్లడించింది. ముందస్తు కొనుగోలు కోసం.. దగ్గర్లోని స్టోర్లను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. జియో.కామ్, జియో నెక్స్ వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకోవచ్చని కూడా వివరించింది.
ఫీచర్లు ఇవే(JioPhone Next features)..
- 5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే (గొరిళ్లా గ్లాస్ ప్రొటెక్షన్)
- 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్
- క్వాల్కమ్ శ్నాప్డ్రాగన్ 215, క్వాడ్‌కోర్ ప్రాసెసర్
- 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ
- డ్యుయల్ నానో సిమ్
వినాయక చవితికి విడుదల చేయాల్సింది కానీ..
నిజానికి జియోఫోన్‌నెక్ట్స్ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10న విడుదల చేయాలని రిలయన్స్ జియో. అయితే ఆ సమయానికి ఇంకా ట్రయల్స్ పూర్తవలేదని ఈ కారణంగానే.. ఫోన్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళికి ఫోన్ అందుబాటులోకి వస్తుందని అప్పుడే స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook