Fake UPI Payment Alert: ఇప్పుడు కొత్తగా ఫేక్ యూపీఐ యాప్స్ వాడుకలో వచ్చేశాయి. సైబర్ నేరగాళ్లు ఫేక్ యూపీఐ యాప్స్ ద్వారా మోసాలు చేసేందుకు, మీ ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలీ ఫేక్ యూపీఐ యాప్స్ ఎలా ఉంటాయి, ఎలా వీటి నుంచి తప్పించుకోవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ చెల్లింపులు పెరగడంతో చేతిలో రూపాయి కూడా లేకుండా మార్కెట్‌కు వెళ్లగలుగుతున్నాం. చెల్లింపుల కోసం పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడుతున్నాం. యూపీఐ యాప్స్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాం. ఓ వైపు యూపీఐ పేమెంట్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. అదే సమయంలో యూపీఐ యాప్స్‌తో మోసాలు కూడా అధికమౌతున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో కొత్తగా యూపీఐ యాప్ ఫ్రాడ్ వెలుగుచూసింది. ఇప్పుుడు సైబర్ నేరగాళ్లు ఫేక్ యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేసేలా చేస్తున్నారు. వీటి ద్వారా ఫోన్‌లో పేమెంట్స్ సక్సెస్ అని కన్పించినా మీ ఎక్కౌంట్‌లోకి డబ్బులు చేరవు. ఈ ఫేక్ యూపీఐ ఫ్రాడ్ గురించి తెలుసుకుందాం.


గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌ను పోలిన నకిలీ యూపీఐ యాప్స్‌తో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి చూడ్డానికి అసలైన యాప్స్‌లానే ఉంటాయి. వీటి సహాయంతో సైబర్ నేరగాళ్లు చిన్న చిన్న వ్యాపారులు, దుకాణదారులు, కార్మికులను మోసం చేస్తారు. స్కామర్లు ఫేక్ యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేశాక నకిలీ స్క్రీన్ షాట్ చూపిస్తారు. నకిలీ యాప్ ద్వారా పేమెంట్ చేశాక అసలు యాప్‌లో వచ్చినట్టే నోటిఫికేషన్ కన్పిస్తుంది. దాంతో పేమెంట్ అయిపోయిందనుకుంటారు. ఈ ఫేక్ యూపీఐ లింక్స్ టెలీగ్రామ్ ద్వారా షేర్ అవుతున్నాయి. మరి వీటిని ఎలా నియంత్రించాలి, పేమెంట్ నకిలీ యాప్‌తో జరుగుతోందా, రియల్ యాప్‌తో జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి. 


ముందుగా మీరు పేమెంట్ వెరిఫై చేసుకోవాలి. మీ యూపీఐ యాప్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా పేమెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. పేమెంట్ విషయంలో ఎప్పుడైనా అనుమానం వస్తే ముందు మీ వైపు నుంచి చెక్ చేసుకోవడం మంచి పద్ధతి. అంటే అవతలి వ్యక్తి చూపించే పేమెంట్ స్క్రీన్ షాట్ లేదా నోటిపికేషన్‌పై ఆధారపడకుండా మీ ఎక్కౌంట్లో చెక్ చేసుకోవాలి. 


Also read: SIP Return Calculation: 5 వేల SIPతో 10 కోట్లు సమకూర్చేందుకు ఎన్నేళ్లు పడుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.