Mutual Fund SIP Returns in Telugu: దీర్ఘ కాలిక పెట్టుబడి విధానంలో మ్యూచ్యువల్ ఫండ్ ఎస్ఐపీ బెస్ట్ ఆప్షన్. దీర్ఘకాలంలో మ్యూచ్యువల్ ఫండ్ ఎస్ఐపీ అధిక రిటర్న్స్ అందిస్తుంది. తక్కువ వ్యవధిలో ఎస్ఐపీ ద్వారా నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తూ 10 వేల ఫండ్ ఎలా సమకూర్చవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోస ఓ స్టెప్ అప్ ఫార్ములా ఉంది.
సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది చాలామందికి లాభదాయకం. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయలేనివారికి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో తెలియనివారికి మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ బెస్ట్ ఆప్షన్. 5 వేల రూపాయల ఎస్ఐపీతో ప్రారంభించి సరాసరిన 12 శాతం రిటర్న్స్ చొప్పున పొందుతూ 36 ఏళ్లకు ఏకంగా 10.19 కోట్లు సమకూర్చవచ్చు. ఈ మొత్తం సమకూర్చాలంటే ఏడాదికి 10 శాతం ఎస్ఐపీ పెంచుకుంటూ పోవాలి.
ఇది కాకుండా 5 వేల ఎస్ఐపీతో ప్రారంభిస్తే ఏడాదికి 15 శాతం రిటర్న్స్ లభిస్తే 35 ఏళ్లకు 10.50 కోట్ల ఫండ్ సమకూరుతుంది. దీనికోసం ఏడాదికి ఎస్ఐపీలో 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కనీసం 1000 రూపాయలతో కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేయవచ్చు.
అయితే స్టాక్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడూ మార్కెట్ పరిస్థితిని బట్టి ఉంటాయి. ఎగుడు దిగుడు రెండూ ఉండవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేముందు నిపుణుల్ని సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.