HDFC Hikes Fixed Deposit Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ తాజా వడ్డీ రేట్లు ఇలా..


==> 7 నుంచి 14 రోజులు–3.00 శాతం 
==> 15 నుంచి 29 రోజులు–3.00 శాతం
==> 30 నుంచి 45 రోజులు–3.50 శాతం
==> 46 నుంచి 6 నెలలు-4.50 శాతం
==> 6 నెలల నుంచి 9 నెలల వరకు- 5.75 శాతం
==> 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు- 6.00 శాతం
==> ఒక సంవత్సరం నుంచి 15 నెలల వరకు- 6.60 శాతం
==> 15 నెలల నుంచి 18 నెలల వరకు- 7.10 శాతం
==> 18 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు- 7.00 శాతం


పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కూడా ఎఫ్‌డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ పథకంపై బ్యాంక్ ఈ పెంపుదల చేసింది. బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 6.50 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.30 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తరువాత దాదాపు అన్ని బ్యాంకులు తమ డిపాజిట్, లోన్ల రేట్లను పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.


Also Read: YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు   


Also Read: YSR Law Nestham Scheme: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి