Online Shopping: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైపోయింది. అత్యంత చౌకగా షాపింగ్ చేయాలంటే..ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభమైపోయాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫెస్టివ్ సీజన్ ప్రారంభం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభమైపోయాయి. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో విభిన్న రకాల ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయి. విభిన్న రకాల ధరలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్‌లో లబ్ది పొందేందుకు ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫ్రీడమ్ సేల్ అనేవి ప్రీమియం సభ్యులకు నిన్న రాత్రి నుంచి..మిగిలినవారికి ఇవాళ రాత్రి నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.


చాలామంది వీకెండ్స్‌లో ఆఫర్లు భాగుంటాయని అనుకుంటారు. కానీ అది వాస్తవ కానేకాదు. వీకెండ్‌లో సహజంగానే ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోతుంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డిస్కౌంట్ ఎప్పుడూ ఉండదు. సాధారణ రోజుల్లో షాపింగ్ చేయడం వల్ల మంచి డిస్కౌంట్లు లభించే అవకాశాలున్నాయి.


షాపింగ్ కోసం క్రెడిట్ కార్డు వినియోగిస్తే మంచి లాభాలుంటాయి. ఇతర ఆఫర్ల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలుంటాయి. డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు వినియోగం ద్వారానే లాభాలు అధికం.  మీ వద్ద క్రెడిట్ కార్డు ఉంటే..ఆన్‌లైన్ షాపింగ్ సందర్భంగా అదే వాడండి. ఎప్పటికప్పుడు వివిధ బ్యాంకులు అందించే ఆఫర్లు పొందేందుకు అవకాశముంటుంది. 


Also read: Passport: పాస్‌పోర్ట్‌‌కు ఆన్‌లైన్‌లో ఇలా ఆప్లే చేస్తే చాలు..మీ ఇంటికొచ్చేస్తుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook