Passport: పాస్‌పోర్ట్ లేదని చింతిస్తున్నారా..ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేస్తే చాలు..కొన్నిరోజుల్లోనే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
విదేశాలకు వెళ్లాలంటే కావల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. చదువు కోసమైనా, తీర్ధయాత్ర కోసమైనా, పర్యటన, ఉద్యోగ, వ్యాపారాల కోసమైనా సరే విదేశీయానం చేయాలంటే పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి.
ఇటీవలి కాలంలో విదేశీ ప్రయాణాలు బాగా పెరిగాయి. ఫలితంగా పాస్‌పోర్ట్ అవసరం పెరిగింది. ఈ పరిస్థితిని చూసి పాస్‌పోర్ట్ సేవా పరియోజనను 2010లో ప్రారంభించారు. పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రక్రియను సులభతరం చేసింది. పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, పోలీసు క్లియరెన్స్ అవసరం. మీరు కూడా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే..ఆన్‌లైన్‌లో చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి
1. ముందుగా portalindia.gov.in పోర్టల్ ఓపెన్ చేయాలి.
2. హోమ్ స్క్రీన్‌పై రిజిస్టర్ నౌ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా పోర్టల్ రిజిస్ట్రేషన్ చేయాలి
3. రిజిస్ట్రేషన్ తరువాత పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లి..రిజిస్టర్ ఐడీతో లాగిన్ చేయాలి.
4. ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కోసం దరఖాస్తు కోసం బటన్ క్లిక్చేయాలి.
5. దరఖాస్తులో అన్ని వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
6. వ్యూ సేవ్డ్ లేదా సబ్మిటెడ్ అప్లికేషన్ ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి.
7. ఇప్పుడు కనీస ఛార్జ్ చెల్లించేందుకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ క్లిక్ చేయాలి. ఫీజు 1500 రూపాయలు కాగా, తత్కాల్‌కు 2000 రూపాయలు ఫీజుగా ఉంది.
8.నెట్ బ్యాంకింగ్ లేదా ఇత పేమెంట్ విధానంతో చెల్లింపు చేసిన తరువాత రిసీప్ట్ ప్రింట్ క్లిక్ చేయాలి.
9. దరఖాస్తు నింపిన తరువాత వివరాలతో ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. పాస్‌పోర్ట్ కార్యాలయంలో చూపించేందుకు ఈ మెస్సేజ్ అవసరం.
10. దరఖాస్తు చేసేటప్పుడు చెప్పిన వివరాలకు సంబంధించిన అన్ని కాగితాలను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి నిర్ణీత సమయంలో తీసుకుని వెళ్లాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook