FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ పధకాల్లో ఇన్వెస్ట్ చేసేముందు ఏ బ్యాంకులో ఏ మేరకు వడ్డీ లభిస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉండవు. అందుకే దేశంలో 9 శాతం కంటే అధిక వడ్డీ చెల్లించే బ్యాంకులు ఏమున్నాయో తెలుసుకుందాం. దేశంలో మొత్తం 6 బ్యాంకులు అత్యధికంగా 9 శాతానికి పైగా వడ్డీ చెల్లిస్తున్నాయి. సాధారణంగా ప్రతి బ్యాంకులో సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు


యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అంటే 7 రోజుల్ని 10 ఏళ్ల కాలవ్యవధి కలిగినవాటిపై 4.50 శాతం నుంచి 9.50 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తాయి. 1001 రోజుల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై అత్యధికంగా 9 శాతం వడ్డీ లభిస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి అమల్లో ఉన్న ఈ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల కంటే అత్యధికం.


సూర్యోదయ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు


సూర్యోదయ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ కూడా 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం వడ్డీ చెల్లిస్తాయి. 2 ఏళ్ల రెండ్రోజుల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.10 శాతం వడ్డీ ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు 2023 డిసెంబర్ 22 నుంచి అమల్లో ఉన్నాయి. 


ఈక్విటాస్ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సీనియర్ సిటిజన్లకు చెందిన 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 9 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. 444 రోజుల ఎఫ్‌డీపై అత్యధికంగా 9 శాతం అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.50 శాతం వడ్డీ అందిస్తోంది. అంటే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 9.50 శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు ఇదే.


ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు


ఉత్కర్ష్ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు చెందిన 7 రోజుల్నించి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.60 శాతం నుంచి 9.10 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది. అదే 2-3 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై గరిష్టంగా 9.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2023 ఆగస్టు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.


ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేటు


ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు చెందిన 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 3.60 శాతం నుంచి 9.21 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 750 రోజుల ఎఫ్‌డీపై గరిష్టంగా 9.21 శాతం వడ్డీ అందుతోంది. ఈ వడ్డీ రేట్లు కూడా గత ఏడాది అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి.


జన స్మాల్ పైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు


జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన సీనియర్ సిటిజన్లకు చెందిన ఎఫ్‌డీలపై 3.50 శాతం నుంచి 9 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. 365 రోజుల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై గరిష్టంగా 9 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి.


Also read: Post Office Superhit Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీములో చేరితే నెలకు 20 వేలు ఆదాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook