FD vs MF :  ప్రస్తుతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీరేట్లను అమలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నవారికి ఇవి ఒక మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులో స్థిరమైన వడ్డీ రేట్లు అందిస్తాయి. మీకు గ్యారెంటీ రిటర్న్ ఉంటుంది. వడ్డీరేట్లపై మీరు ఎంతకాలం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అంతకాలం వడ్డీ రేటు మారవు. మీకు ఖచ్చితంగా మెచ్యూరిటీ చివరలో గ్యారంటీ డబ్బు లభిస్తుంది. అందుకనే ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలోనే ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్లపై మీకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రస్తుతం ఆకర్షణీయమైన రాబడిని అందించే సాధనాలుగా మారాయి. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లపై ఆధారపడి ఇన్వెస్టర్ల పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టుబడి పెట్టి వాటిపై వచ్చే రాబడిని మదుపుదారులకు అందిస్తూ ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్ లపై కూడా స్థిరమైన ఆదాయమై లభిస్తుంది. కానీ రేటింగును బట్టి ఆయా మ్యూచువల్ ఫండ్ ను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే వాటిపై మంచి రాబడి లభించే అవకాశం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్లపై ఆధారపడి ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ నేరుగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించే అనుభవం లేని వారు సాంప్రదాయ పొదుపు సాధనాల కన్నా ఎక్కువ ఆదాయం పొందాలని ఆలోచించేవారు మ్యూచువల్ ఫండ్స్ ను చక్కటి ఎంపికగా ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ హౌసెస్ ఒక మేనేజర్ ద్వారా స్టాక్ మార్కెట్ లోని ఎంపిక చేసిన స్టాక్స్ లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. ఆ స్టాక్స్ ఇచ్చే రాబడి మదుపుదారులకు అందజేస్తారు. 


ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎందులో  మీ డబ్బును దాచుకుంటే మంచిదో తెలుసుకుందాం:


ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు ఒకేసారి మొత్తంగా డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎఫ్డి డిపాజిట్లు వెయ్యి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు అందుబాటులో ఉంటాయి.  కనీసం నెల రోజుల నుంచి రెండు మూడు సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ లను చేయవచ్చు. డిపాజిట్లు  మెచ్యూరిటీ పూర్తయిన అనంతరం మీరు ఆటో రెన్యువల్ ఆప్షన్ తీసుకుంటే మీ ఎఫ్డి మళ్లీ కంటిన్యూ అవుతుంది. కొన్ని బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయాన్ని అకౌంట్లో వేస్తూ ఉంటాయి.ఎఫ్డి నియమాలు ఒక్కో బ్యాంకుకు ఒకోరకంగా ఉంటాయి.వడ్డీ ఆదాయంపై  మినహాయింపు పొందాలంటే Form 15H సమర్పించాల్సి ఉంటుంది.   సీనియర్ సిటిజనులకు అదనపు వడ్డీ లభిస్తుంది. 


Also Read : Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!


ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, ఇవి ఈక్విటీ మార్కెట్లపై ఆధారపడి మీకు రాబడిని అందిస్తాయి. భారత ఈక్విటీ మార్కెట్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్ లుగా పేరు సంపాదించుకున్నాయి. గడచిన 20 సంవత్సరాలలో నిఫ్టీ, సెన్సెక్స్ గమనించినట్లయితే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లను విశ్వసించి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిలో పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మీరు సిప్ రూపంలో ప్రతినెల నిర్దిష్ట మొత్తాన్ని మదుపు చేసుకోవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కు మెచ్యూరిటీ అనంతరం మీకు పెద్ద ఎత్తున లాభాలు లభించే అవకాశం ఉంటుంది.మ్యూచువల్ ఫండ్స్ మంచి పర్ఫామెన్స్ అందించినట్లయితే బ్యాంకుల అందించే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల కన్నా కూడా అత్యధికంగా రాబడిని అందిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్ తో కూడుకున్నవని మాత్రం గమనించాల్సి ఉంటుంది.


Also Read : Shruti Haasan : ఎడా పెడా తినేసి డైటింగ్ చేయకపోయినా..బరువు మాత్రం పెరగలేదు..శృతిహాసన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter