Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!

Credit Score  :  సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ మీరు లోన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు, కొన్ని రకాల సెక్యూర్డ్ లోన్లను అందిస్తాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 7, 2024, 09:03 PM IST
Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!

Bank Loans : ఈ మధ్యకాలంలో సిబిల్ స్కోర్ లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. సిబిల్ స్కోర్ కనీసం 750 పైన ఉంటే గాని లోన్ ఇవ్వడం లేదు. కానీ చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడంలో జాప్యం అదేవిధంగా EMIలను చెల్లించడంలో జాప్యం వంటి సమస్యలతో తమ క్రెడిట్ స్కోరును కోల్పోతున్నారు. ఫలితంగా బ్యాంకులో లోన్ అప్లై చేసుకున్నప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో లోన్ రిజెక్ట్ అవుతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, వెహికల్ రుణాలు అదేవిధంగా పర్సనల్ రుణాల విషయంలో ఈ సమస్య తలెత్తుతోంది.

సాధారణంగా క్రెడిట్ స్కోర్ అనేది పలు సంస్థలు అందించే మీ రుణ బాధ్యతకు రేటింగ్ అని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ స్కోర్ ను సిబిల్ అనే సంస్థ ప్రధానంగా అందజేస్తుంది. సిబిల్ సంస్థ ఇచ్చే రేటింగ్ 200 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ 800 నుంచి 900 మధ్యలో ఉన్నట్లయితే మీది చాలా అద్భుతమైన సిబిల్ స్కోర్ అని అర్థం. 600 నుంచి 800 మధ్యలో ఉంటే మధ్యస్థంగా ఉందని అర్థం. 600 కన్నా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉందని అర్థం. 600 కన్నా తక్కువగా క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపవు.

అయితే ఒక్కోసారి మనకు చాలా తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద లోన్ పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి లోన్ కావాలి అనుకున్నట్లయితే, గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. మీరు బంగారం కుదువ పెట్టి బ్యాంకు నుంచి లోన్ పొందాలనుకున్నట్లయితే, మీకు ఎలాంటి సిబిల్ స్కోర్ లేకపోయినప్పటికీ మీరు లోన్ పొందవచ్చు. 

Also Read : Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!

ఈ గోల్డ్ లోన్ ప్రధానంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం అందిస్తాయి. బంగారు రుణాలు వడ్డీ రేటు కూడా సాధారణ మార్కెట్లో వడ్డీరేట్ల కన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లోన్స్ వడ్డీ కన్నా కూడా గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 

ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయి వద్ద ఉంది. ఈ నేపథ్యంలో మీకు పెద్ద మొత్తంలో బ్యాంకు నుంచి రుణం లభించే అవకాశం ఉంటుంది. కావునా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవచ్చు. గోల్డ్ లోన్స్ మీకు అతి తక్కువ  సమయంలో లభిస్తాయి. అలాగే దీనికి పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా ఉండదు. అందుకే మీకు గోల్డ్ లోన్స్ ద్వారా సెక్యూర్డ్ రుణాలు  లభిస్తాయి. సిబిల్ స్కోర్ లేకపోయినప్పటికీ ఈ రుణాలు లభిస్తూ ఉండటం విశేషం.  అయితే గోల్డ్ లోన్ తీసుకునే సమయంలో మీరు  ఏ బ్యాంకులో వడ్డీ  తక్కువగా ఉందో ఆ బ్యాంకుల్లోనే రుణం తీసుకుంటే మంచిది.  ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే మీకు నమ్మకంగా  నగలకు హామీ లభిస్తుంది.

Also Read : Shruti Haasan : ఎడా పెడా తినేసి డైటింగ్ చేయకపోయినా..బరువు మాత్రం పెరగలేదు..శృతిహాసన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News