FD Interest Rates: బ్యాంకుల్లో సాధారణంగా వేర్వేరు కాల వ్యవధుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. ఇవి 7 రోజుల్నించి మొదలుకుని 10 సంవత్సరాల వరకూ ఉంటాయి. ఇందులో కూడా 7 రోజుల్నించి 12 నెలలు స్వల్పకాల వ్యవధి, 1 ఏడాది నుంచి 10 ఏళ్లు లాంగ్ టెర్మ్ ఉంటాయి. అందుకే వడ్డీ రేట్లు కూడా బ్యాంకుని బట్టి ఎఫ్‌డి కాల వ్యవధిని బట్టి మారిపోతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలే. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితమే కాకుండా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. వేర్వేరు కాల వ్యవధులు కలిగిన ఎఫ్‌డీలపై వేర్వేరు వడ్డీ రేట్లు అందిస్తుంటాయి. ఎక్కువగా 1 ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆదరణ లభిస్తుంటుంది. ఈ క్రమంలో దేశంలోని టాప్ బ్యాంకుల్లో 1 ఏడాది ఎఫ్‌డీలపై లభిస్తున్న వడ్డీ ఎంత ఉందో తెలుసుకుందాం.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ఎస్బీఐ ఎఫ్‌డీలపై ఇస్తున్న వడ్డీ 3 శాతం నుంచి 5.75 శాతం వరకూ ఉంది. ఇది 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి వరకూ ఉన్న ఎఫ్‌డీలకు అందుబాటులో ఉంది. 


పంజాబ్ నేషనల్ బ్యాంక్


పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా సాధారణ పౌరులకు 7 రోజుల్నించి 1 ఏడాది వరకూ ఎఫ్‌డీపై 3 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 


కెనరా బ్యాంక్


కెనరా బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 6.85 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. 


హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు


ఈ బ్యాంకులో సాధారణ పౌరులకు 7 రోజుల్నించి ఒక ఏడాది వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 6 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది.


ఐసీఐసీఐ బ్యాంకు


ఇక్కడ కూడా సాధారణ పౌరులకు 7 రోజుల్నించి ఒక ఏడాది వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 నుంచి 6 శాతం వడ్డీ లభిస్తోంది. 


ఎస్ బ్యాంక్


ఈ బ్యాంకు అత్యధికంగా వడ్డీ ఇస్తోంది. ఇందులో 7 రోజుల్నించి ఒక ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3.25 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. 


యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్


అన్నింటికంటే అత్యధికంగా వడ్డీ అందుతున్నది ఈ బ్యాంకులోనే. సాధారణ పౌరులకు 7 రోజుల్నించి ఒక ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 4.50 శాతం నుంచి 7.85 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook