7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డీఏ, డీఆర్ రూపంలో భారీగా బకాయిలున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసినవి. అవుట్‌స్టాండింగ్ అలవెన్సులుగా మిగిలిపోయాయి. వీటిని ఇప్పుడు చెల్లించేందుకు మార్గం సుగమం కావచ్చని తెలుస్తోంది.
కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ చెల్లించలేదు. అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఈ డబ్బుల్ని చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఏకంగా ఒక కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కరోనా కాలంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకు ప్రతిపాదన అందింది. అటు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు లేఖ రాశాయి.
డీఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో రెండు సార్లు చెల్లిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లింంపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ పాత బకాయిలను చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 2 లక్షల రూపాయలు ప్రయోజనం కలగవచ్చు. లెవెల్ 1 ఉద్యోగుల డీఏ ఎరియర్లు 11,880 రూపాయల్నించి 37,554 రూపాయలుగా ఉంది. లెవెల్ 13 ఉద్యోగుల ఎరియర్లు 1,23,100 రూపాయల్నించి 2,15,900 రూపాయలుగా ఉంది. లెవెల్ 14 ఉద్యోగుల ఎరియర్లు 1,44,200 రూపాయల్నించి 2,18, 200 రూపాయలుగా ఉంది.
Also read: 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులే ఇక పనిదినాలు, ఎప్పట్నించంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook