Flight fares: భారీగా తగ్గనున్న విమాన ఛార్జీలు- కారణాలివే..!
Flight fares: అంతర్జాతీయంగా విమానయానంపై ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో.. విమాన ఛార్జీలు తగ్గే అవకాశముంది. రానున్న నెలల్లో ప్రస్తుతంతో పోలిస్తే ఛార్జీలు దాదాపు సగం తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
Flight fares: విమానప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్. త్వరలో విమాన ఛార్జీలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాల ఛార్జీలు దిగిరానున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ వల్ల ఏర్పడిన సంక్షోభ సమయంలో ఛార్జీలు భారీగా పెరగ్గా.. ఇప్పుడు వాటిని తగ్గేంచే యోచనలో విమానయనా సంస్థలు ఉన్నాయని సమాచారం.
ధరలు ఎంత తగ్గొచ్చు?
పరిశ్రమ వర్గాల ప్రకారం విమాన ఛార్జీలు 40 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయి. ఇదుకు ప్రధాన కారణం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు బయటపడగలుగుతున్నాయి. దీనితో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా మన దేశం కూడా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చింది.
ఆంక్షల ఎత్తివేతతో..
ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా పరిమిత సంఖ్యలో విమనానాలను నడిపించాయి. ఇప్పుడు ఆంక్షలు సడలిస్తున్న కారణంగా విమానాల సంఖ్యను పెంచనున్నాయి విమానయాన సంస్థలు. ముఖ్యంగా యూరప్‌కు చెందిన లుఫ్తాన్సా, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్సెస్ (స్విస్) వంటి సంస్థలు రానున్న నెలల్లో విమానాల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్నాయట. సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా 17 శాతం మేర విమానాల సంఖ్యలన పెంచేందుకు ప్లాన్ చేస్తోందని తెలిసింది.
ఇక దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ రానున్న నెలల్లో అంతర్జాతీయంగా 100 శాతం విమానాలను నడిపించాలని భావిస్తోందని సమాచారం.
కొవిడ్ కాలంలో పెరిగిన ఛార్జీలు..
కరోనా కాలంలో అంతర్జాతీయ విమానాలు పరిమిత సంఖ్యలో మాత్రమే నడిచాయి. ముఖ్యంగా వివిధ దేశాలతో కుదిరిన ఎయిర్‌బబుల్ ఒప్పందాల కారణంగా తక్కువ సామర్థ్యంతో, పరిమిత విమానాలకు మాత్రమే అనుమతి ఉండేది. దీనితో విమానయాన సంస్థలు 100 శాతం వరకు ఛార్జీలు పెంచాయి. కరోనా వల్ల వచ్చిన నష్టాలు, తక్కువ సామర్థ్యంతో నడుస్తుండటం వల్ల ఏర్పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ఱణయం తీసుకున్నాయి ఎయిర్‌లైన్ సంస్థలు. దాదాపు రెండేళ్లుగా ఇలాంటి ఆంక్షల మధ్యే విమానాలను నడిపిస్తున్నాయి.
ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చాలా దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం.. వల్ల విమనాయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో పని చేయనున్నాయని.. ఈ కారణంగా ఛార్జీలు కూడా కొవిడ్ పూర్వ స్థాయికి తగ్గే వీలుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్‌పాయ్ వార్తా సంస్థ ఎకానామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఏటీఎఫ్ రూపంలో అడ్డంకి..
అంచనాలకు తగ్గట్లు విమానయాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉన్నా.. ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) రూపంలో ఇందుకు ఆటంకాలు ఏర్పడొచ్చని కూడా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతుండటం వల్ల ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల ఏటీఎఫ్ ధరలు కూడా మరింత భారీగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే దేశంలో పలుమార్లు ఏటీఎఫ్ ధరలను పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. మరి ఏటీఎఫ్ ధరలు భారంగా మారితే విమానయాన ఛార్జీలు ఎంతమేర తగ్గుతాయి అనేది వేచి చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Today Gold Rate 11 March 2022: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!!
Also read: DA hike: ఉద్యోగులకు హోలీ గిఫ్ట్- డీఏ పెంపుపై త్వరలో ప్రభుత్వ ప్రకటన?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook