DA hike: కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు హోలీ పండుగకు ముందు శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. పండుగ కానుక కింద ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపుపై ప్రకటన చేసేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఉద్యోగులకు డీఏ పెంపు విషయమై మార్చి 16న కేంద్ర కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
డీఏ ఎంత పెరగొచ్చు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డీఏ వస్తోంది. ఇది మరో 3 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తం 34 శాతానికి డీఏను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై హోలీ పండుగ లోపే ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ వార్తా సంస్థ జీ బిజ్ ప్రకారం.. మార్చి 16న డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రభుత్వం డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే.. 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
డీఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది?
ఈ సారి ప్రకటనలో 3 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం రూ.6,480 నుంచి.. అత్యధికంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది.
ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ డేటా ప్రకారం 2021 డిసెంబర్ నాటికే డీఏ 34.04 శాతానికి చేరింది.
ఒక ఉద్యోగి బేసిస్ శాలరీ రూ.18,000 ఉంటే.. కొత్త డీఏ (34 శాతం) వాటా రూ.6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31 శాతం డీఏ (రూ.5,580) వస్తోంది.
డీఏ గురించి..
డీఏ అంటే డియర్నెస్ అలవెన్స్. ప్రభుత్వం ఉద్యోగుల జీవనవిధానాన్ని (ఆహారం, సామాజిక భద్రత) మరింత మెరుగుపరిచేందుకు ఇచ్చేదే డీఏ. 1972లో దీనిని ప్రవేశపెట్టారు. తొలుత ముంబయిలో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగులందరికీ దీనిని అమలు చేయడం ప్రారంభించింది ప్రభుత్వం.
ప్రతి ఏటా జనవరి, జులై నెలల్లో డీఏల్లో మార్పులు చేస్తుంది ప్రభుత్వం.
అదే పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ఉద్యోగులకు డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) ఇస్తుంది ప్రభుత్వం. గత ఏడాది జులైలో దీనిని 17 నుంచి 28 శాతానికి పెంచడం గమనార్హం.
Also read: Bank Loans: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశాలివే
Also read: Interest Rates: కోటక్ మహీంద్రా గుడ్‌న్యూస్, ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook