Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి భారీ బంపర్ ఆఫర్. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్ అందుతోంది. కేవలం ఆఫర్లే అనుకుంటున్నారా..నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చ్ 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ థమాల్ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లు, వేరెబుల్స్, టీవీలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి మోడల్స్ కూడా బిగ్‌సేల్ ధమాకాలో ఉన్నాయి. ఐఫోన్ 12 సిరీస్ మోడల్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ ఉంది. అంతేకాదు వినియోగదారుల కోసం బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంది. 


ఫ్లిప్‌కార్ట్ అధీకృత పేజ్‌పై ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం సమగ్రంగా ఉంది. బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, కాంబో ఆఫర్లు రోజూ రాత్రి 12 గంటలు, ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తుంది. అదే సమయంలో మద్యాహ్నం 12 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ లూట్ బజార్ పేరుతో అతి తక్కువ ధరలకు వస్తువులు లభించును. డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంటుంది. స్మార్ట్ వాచెస్, టీవీలు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ కూడా వారాంతంలోగా చేరుతాయని ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసిన టీజర్లలో ఉంది. ఈ సేల్‌లో యూపీఐ లావాదేవీలపై వేయి రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఇవి కాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్స్, ఎక్స్చేంజ్ సౌకర్యం వంటివి ఉన్నాయి. 


ఇంకా ఆఫర్లు ఎలా ఉంటాయి, ఏయే వస్తువులపై ఏ ఆఫర్ ఉంది, ఎంత ఉందనే వివరాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. గేమ్స్, ఇయర్ ఫోన్స్, వైర్‌లెస్ ఇయర్‌పోన్స్, వేరెబుల్స్ వంటివాటిపై ఏ విధమైన ఆఫర్లున్నాయనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Also read: Fuel Price Hike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. రాబోయే రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.200..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook