Flipkart Smart Watch Offers: ప్రస్తుతం ట్రెండ్ అంతా స్మార్ట్‌వాచీలదే. యువత కావచ్చు పెద్దోళ్లు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు అంతా స్మార్ట్‌వాచీలే ధరిస్తున్నారు. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచీలు ప్రవేశపెడుతున్నాయి. నాయిస్, బోల్ట్, రెడ్‌మి, వన్‌ప్లస్, శాంసంగ్ ఇలా చాలా కంపెనీల స్మార్ట్‌వాచీలు మార్కెట్‌లో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వేసవి ప్రత్యేక సేల్స్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా మంచి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తోంది మే 2 న ప్రారంభమైన ఈ సేల్ మే 9 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో Noise Colorfit Icon 2 స్మార్ట్‌వాచ్‌పై అద్దిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏకంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ వాచ్ కేవలం 999 రూపాయలకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 


Noise Colorfit Icon 2 ఫీచర్లు


ఈ వాచ్ 1.8 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. క్విక్ డయల్ ప్యాడ్, కాలింగ్ హిస్టరీ, ఫేవరేట్ కాంటాక్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా రెండ్రోజులు మాట్లాడుకోవచ్చు. 500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల చాలా క్లియర్‌గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. అన్నింటికంటే మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంటుంది. 


ఇందులో నాయిస్ ఫిట్ ట్రాక్ యాప్ ఉంటుంది. మెటాలిక్ బాడీ విత్ స్లీక్ డిజైన్ కావడంతో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఇన్ బిల్ట్ గేమ్స్, 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సీ విషయంలో ఐపీ 67 ర్యాంకింగ్ ఉంది. అంటే 6 వేల రూపాయలు ఖరీదైన ఈ వాచ్ ఇప్పుడు కేవలం 999 రూపాయలకే లభించనుంది. మరో నాలుగు రోజుల్లో ఆఫర్ ముగుస్తుంది. అందుకే ఈ వాచ్ కావాలంటే త్వరపడండి.


Also read: SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook