Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వోల్టాస్ 1.5 టన్ ఏసీ ధర ఎంతో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ఏసీలు, బట్టలు, కిరాణా సామాన్లపై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఇందులో భాగంగానే వోల్టాస్ ఏసీపై అద్భుతమైన ఆఫర్ ఉంది. 70 వేల రూపాయల వోల్టాస్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ 33 వేలకంటే తక్కువకే లభించనుంది.


వోల్టాస్ స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్


ఈ డీల్‌లో వోల్టాస్ 1.5 టన్ 4 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ మార్కెట్ ధర 69 వేల 990 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 49 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. డిస్కౌంట్ అనంతరం 34 వేల 999 రూపాయలకు లభించనుంది. మరో ప్రీ పెయిడ్ ఆఫర్ ద్వారా ఇంకో వేయి రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ వోల్టాస్ ఏసీ ధర 33 వేల 999 రూపాయలకే లభించనుంది. వోల్టాస్ ఏసీకు అందిస్తున్న సేల్ డీల్‌లో బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే..మరో 1250 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 


వోల్టాస్ 1.5 టన్ ఏసీ ఫీచర్లు ఇవే..


వోల్టాస్ 1.5 టన్ 4 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీలో యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్, ఆటో ఎయిర్ స్వింగ్ ఫీచర్లున్నాయి. ఆటో రీస్టార్ట్ ఫీచర్, స్లీప్ మోడ్ ఫీచర్ కలిగిన ఈ ఏసీలో ఛైల్డ్ లాక్, టైమర్, క్వైట్ మోడ్, మెమరీ ఫీచర్ వంటి అత్యుధునిక సౌకర్యాలున్నాయి.100 శాతం కాపర్‌తో నిర్మితమైన ఈ ఏసీ 4 స్టార్ కావడంతో విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈ నెల 8 వతేదీ వరకూ ఉంటుంది. ఆ తరువాత ఇప్పుడున్న ఆఫర్లు వర్తించవు.


Also read: Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అద్భుత ఆఫర్లు, 5 వేలకే 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ, ఎలాగంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook