Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అద్భుత ఆఫర్లు, 5 వేలకే 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ, ఎలాగంటే

Flipkart Big Saving Days Sale: అద్భుతమైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ..30 వేల టీవీ. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కేవలం 5 వేలకే లభించనుంది. ఎలాగో తెలుసుకోండి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2022, 06:08 PM IST
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అద్భుత ఆఫర్లు, 5 వేలకే 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ, ఎలాగంటే

Flipkart Big Saving Days Sale: అద్భుతమైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ..30 వేల టీవీ. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కేవలం 5 వేలకే లభించనుంది. ఎలాగో తెలుసుకోండి

ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఈ సేల్..మే 8 వరకూ ఉంటుంది. ఈ సేల్ 6 రోజుల వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లున్నాయి. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. Blaupunkt స్మార్ట్ టీవీ అయితే అతి తక్కువగా..మీరు ఊహించలేని ధరకే లభించనుంది. 30 వేల రూపాయల టీవీ ఏకంగా కేవలం 5 వేల రూపాయలకే లభించనుంది. అదెలాగనేది ఇప్పుడు చూద్దాం..

Blaupunkt Cybersound 42 inch Smart TV లాంచింగ్ ప్రైస్ వాస్తవానికి 29 వేల 999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 17 వేల 499 రూపాయలకు లభిస్తుంది. అంటే ఏకంగా 12 వేల 5 వందల రూపాయల మేరకు డిస్కౌంట్ లభించనుంది. ఆ తరువాత ఇప్పుడు బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుంటే మరింత తక్కువకే అందుబాటులో రానుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించుకుంటే..1250 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ టీవీ ధర 16 వేల 249 రూపాయలకు లభించనుంది. ఇక మిగిలింది ఎక్స్చేంజ్ ఆఫర్. మీ పాత టీవీ ఎక్స్చేంజ్ చేస్తే మరో 11 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. అయితే మీరు మార్చాల్సిన టీవీ లేటెస్ట్ మోడల్, మంచి కండీషన్ అయుండాలి. అంటే ఈ స్మార్ట్ టీవీ కేవలం ఇప్పుడు 5 వేల 249 రూపాయలకే లభించనుంది.

Also read: Gold Purchase Tips: అక్షయ తృతీయ నేడే.. బంగారం కొనుగోలుపై తీసుకోవల్సిన జాగ్రత్తలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News