జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభమైన బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కొనే ఆలోచన ఉంటే..ఇదే మంచి అవకాశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్డ్ అందిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఐఫోన్ 13 ప్రత్యేక డిస్కౌంట్ ధర 63,999 రూపాయలకు లభించనుంది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ బ్యాంకు కార్డులపై మరో 1000 రూపాయలు అదనపు డిస్కౌంట్ లభించనుంది. పాత స్మార్ట్ ఫోన్లు ఎక్స్చేంజ్ చేస్తే 17,500 రూపాయలు తగ్గనున్నాయి. అయితే ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌ను బట్టి ఉంటుంది. దీంతోపాటు ఎంపిక చేసిన యూజర్లపై 3 వేల రూపాయలు డిస్కౌంట్ వస్తోంది.


అన్ని ఆఫర్లు, డిస్కౌంట్ల అనంతరం యాపిల్ ఐఫోన్ 13 కేవలం 42,499 రూపాయలకే లభించనుంది. వివిధ రకాల రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. పింక్, బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో లభించనుంది. ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌లో లభిస్తుంది. 


ఐఫోన్ 13లో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. దీంతోపాటు 12 ఎంపీ వైడ్ సెన్సార్, 12 ఎంపి అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. యాపిల్ 13 ఐవోఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐవోఎస్ 16 అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. 


Also read: Budget 2023: నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లకు వరాలుంటాయా, బడ్జెట్ అంచనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook