Flipkart Big Savings Day 2021: నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రారంభం, ఆకర్షణీయమైన ఆఫర్లు
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
Flipkart Big Savings Day 2021 Sale: ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ తీసుకొచ్చింది. 2021లో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది. నాలుగు రోజులపాటు ఈ జరగనున్న ఈ బిగ్ సేల్‌లో మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపు ధరను అందిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మొదటగా ఈ విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఇతర సభ్యులకు అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రారంభం అవుతుంది. ఆఫర్లు ఉన్న కొన్ని మొబైల్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
Also Read: Best smartphones: 12 వేలలో చీప్ అండ్ బెస్ట్, హై స్టోరేజీ, హై క్వాలిటీ కెమెరా ఫోన్స్
రెడ్‌మి 9 ప్రైమ్ (Redmi 9 Prime)
షియోమీ రెడ్‌మి 9 ప్రైమ్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.9,499. కాగా, ఫ్లిప్‌కార్ట్ తాజాగా అందిస్తున్న విక్రయాలలో రూ.8900కి కొనుగోలు చేయవచ్చు. పాత మొబైల్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (Apple iPhone SE)
ఐఫోన్ ఎస్ఈ(64 GB) ప్రస్తుత మార్కెట్ ధర రూ.29,999 కాగా, మీ పాత మొబైల్‌ను అమ్మడం ద్వారా రూ.16,500 వరకు Smartphones డిస్కౌంట్ అందిస్తోంది.
యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్
యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్‌లో రూ.38,999కు విక్రయాలు జరుపుతోంది. పాత స్మార్ట్‌ఫోన్ విక్రయాల ద్వారా అదనపు ప్రయోజనాలు పొందనున్నారు.
Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
పోకో ఎక్స్3
పోకో ఎక్స్3 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న మొబైల్ వేరియంట్ రూ.14,99కు విక్రయిస్తున్నారు. పాత మొబైల్‌ను విక్రయించడం ద్వారా రూ.13,550 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 11 ప్రో మొబైల్ దర రూ.46,999 మరియు రూ.79,999గా నిర్ణయించారు. నాలుగు రోజులపాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే అందుబాటులో ఉండనుంది.
Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook