Flipkart Offer: ల్యాప్‌టాప్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. సగం కన్నా తక్కువ ధరకే ఆసస్ వివోబుక్...
Flipkart Laptop Offers: ఫ్లిప్‌కార్ట్‌లో పలు బ్రాండ్స్‌పై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.1,00,990 విలువ చేసే ఆసస్ వివోబుక్ సగం కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.
Flipkart Laptop Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. కొన్ని వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా ఆసస్ వివోబుక్ కె 15 ఓఎల్ఈడీ (2021)పై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,00,990 విలువ చేసే ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ.46,640కే అందిస్తోంది. దీనిపై డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్ :
ప్రస్తుతం మార్కెట్లో 'ఆసస్ వివో బుక్ కె15 ఓఎల్ఈడీ (2021)' ధర రూ.1,00,990. కానీ ఫ్లిప్‌కార్ట్ 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.65,990కే ఈ ల్యాప్‌టాప్‌ను అందిస్తోంది. ఒకవేళ ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.1250 మేర తగ్గింపు పొందవచ్చు. అంటే.. రూ.64740కే ఈ ల్యాప్‌టాప్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :
'ఆసస్ వివో బుక్ కె15 ఓఎల్ఈడీ (2021)'పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో భారీ తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై రూ.18,100 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే ప్రస్తుతం రూ.64740కి అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను మరింత చౌకగా రూ.46,640కే కొనుగోలు చేయవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.
Also Read: Murder For Chicken: దారుణం.. చికెన్ కర్రీ వండలేదని కొడవలితో భార్యను నరికి చంపిన భర్త...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook