Flipkart Mi Fan Festival: రూ.30 వేల విలువైన షియోమీ 11ఐ 5జీ ఫోన్ రూ.10 వేలకే!
Flipkart Mi Fan Festival: స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్లు ఇస్తోంది. ముఖ్యంగా ఎం ఫోన్లపై.. ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రికార్డు స్థాయి డిస్కౌంట్లు ఇస్తోంది. ఇందులో రూ.30 వేల విలువైన ఫోన్‌ను రూ.9 వేలకే కొనేందుకు అవకాశమిస్తోంది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Mi Fan Festival: ఈ-కామర్స దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సేల్ ఎప్పటి వరకు కొనసాగనుంది. మరి ఈ స్పెషల్ సేల్‌లో ఆఫర్లు ఎలా ఉన్నాయి. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆఫర్లు ఇలా..
ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎంఐ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ముఖ్యంగా ఇటీవల ఆవిష్కరించిన 5జీ స్మార్ట్‌ఫోన్ 5జీ స్మార్ట్.. షియోమీ 11ఐ 5జీపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ ఆఫర్ ఈ నెల 13 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనితో కేవలం నిమిషాల్లోనే ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఎంత తగ్గింపు పొందొచ్చంటే?
దాదాపు రూ.30 వేల విలువైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ స్పెషల్ సేల్‌లో రూ.10 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది. ఈ స్మార్ట్ 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ.5 వేల డిస్కౌంట్ లభిస్తోంది.
ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్ కింద మరింత తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2 వేలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధరను రూ.22,999కి తగ్గుతుంది. ఇది మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కుడా పొందొచ్చు. మరి ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంత తగ్గింపు పొందొచ్చంటే..
ఎక్స్ఛేంజ్ ఆఫర్ వివరాలు ఇలా..
షియోమీ 11ఐ 5జీ ఫోన్ కొనుగోలు చేసే వారికి.. పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13 వేల వరకు తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఒక వేల డిస్కౌంట్ లభిస్తే.. ఈ ఫోన్ ధర రూ.9,999కి చేరుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. రూ.13,000 ఎక్స్ఛేంజ్ అనేది అందరికి లభించకపోవచ్చు. ఫోన్ మోడల్, కండీషన్ వంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ఎక్స్ఛేంజ్ విలువ నిర్ణయిస్తుంది ఫ్లిప్‌కార్ట్.
నోట్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు కేవలం ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఈ మొబైల్ కొనే ముందు మరోసారి ఆఫర్ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం.
Also read: Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!
Also read: Todays Gold Rate: ఇవాళ ఏప్రిల్ 10, 2022 దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook