Flipkart Offers: ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌లలో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు లభిస్తుంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఒక్కోసారి నమ్మశక్యం కాని ధరలకే ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు వివిద రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో వివో, శాంసంగ్, యాపిల్, రెడ్‌మి, రియల్ మి, ఒప్పో వంటివి ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్న ఆఫర్ వివో స్మార్ట్‌ఫోన్‌ది. vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర 20,999 రూపాయలుగా ఉంది. కానీ అన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు పొందితే కేవలం 539 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


vivo T2x 5G అసలు ధర 20,999 రూపాయలు. 23 శాతం డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో 15,999 రూపాయలకు లిస్టెడ్ అయింది. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ కూడా వర్తిస్తుంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌లో ఇస్తే నేరుగా 15,450 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ కేవలం 539 రూపాయలకే మీరు తీసుకెళ్లవచ్చు. అయితే ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ మోడల్, కండీషన్ బాగుండి ఉండాలి. ఎక్స్చేంజ్ ధర మీ ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి నిర్ణయమౌతుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ధర పూర్తి వర్తిస్తే మాత్రం పండగే. కేవలం 549 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.


లేదా ఇతర ఆఫర్లు కూడా ఉండనే ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుపై నేరుగా 1250 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 14,750 రూపాయలకు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. 


vivo T2x 5G ఫీచర్లు


వివో కంపెనీకు చెందిన vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ , 2 మెగాపిక్సెల్ కెమేరాలతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమేరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో వస్తోంది. డ్యూయల్ సిమ్ ఆప్షన్, మెరైన్ బ్లూ కలర్‌లో అందుబాటులో ఉంది. వివోతో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. 


Also read: Maruti Electric SUV: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ ఎప్పుడు , ఆ కారు ప్రత్యేకతలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook