Samsung Galaxy Z Flip 3,  Z Fold 3 Smartphones prices to reduce in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే 'బిగ్ బిలియన్ సేల్' పూర్తికాగా.. ప్రస్తుతం 'బిగ్ దసరా సేల్' నడుస్తోంది. ఇప్పుడు ప్రతి వస్తువుపై అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. 'బిగ్ దీపావళి సేల్' కూడా త్వరలోనే ఆరంభం కానుంది. ఆ సమయంలో కూడా అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రముఖ మొబైల్ సంస్థ 'శామ్‌సంగ్' మంచి ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. గత సంవత్సరం విడుదలైన ఫ్లిప్ ఫోన్‌, మడత స్క్రీన్‌ ఫోన్‌లపై భారీగా ధరలను తగ్గించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శామ్‌సంగ్ Z ఫ్లిప్ 3 ధర 'బిగ్ దసరా సేల్'లో భారీగా తగ్గనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ధర రూ. 60,000 లోపు ఉంటుందని సమాచారం. ఇది గెలాక్సీ Z ఫ్లిప్ 3ని కొనుగోలు చేయగల చౌకైన ధర. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ధర రూ. 1 లక్ష లోపు ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు లాంచ్ ధర రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉంది. 


శామ్‌సంగ్ Z ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోల్డబుల్ 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. ఫ్లిప్ 3 ఫోన్ 3300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 15W వైర్డు ఛార్జింగ్ మాత్రమే ఉంది. 


శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3లో 7.6 అంగుళాల ప్రైమరీ క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 


Also Read: నటిని షోరూంలో లాక్ చేసిన సిబ్బంది... చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన.. కేరళలో షాకింగ్


Also Read: Snake Viral Video: ఎప్పుడైనా మీరు స్మశానంలో పాములను చూశారా..అయితే ఒక్కసారి ఈ వీడియోను చూడండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook