Flipkart Big Saving Days OnePlus Y1 32 Inch TV Offer: 'వ‌న్‌ప్ల‌స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత్‌లో వ‌న్‌ప్ల‌స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన వ‌న్‌ప్ల‌స్.. మార్కెట్లోకి స్మార్ట్ టీవీలను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ మాదిరే స్మార్ట్ టీవీలకు కూడా దగ్గర భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం చాలా సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. భార‌త మార్కెట్లో గతేడాది విడుద‌ల చేసిన వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీ ప్ర‌స్తుతం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో శనివారం (ఆగష్టు 6) నుంచి 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. 'బిగ్ సేవింగ్ డేస్' ఆఫర్ ఆగష్టు 6 నుంచి 10వరకు అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై రూ. 6500 తగ్గింపు ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 19,999గా  ఉంది. 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో (రూ. 6500) ఈ టీవీ రూ. 13,499లకు అందుబాటులో ఉంది. 


వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ. 2000 అదనపు తగ్గింపు ఉంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 9000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 13,499 వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీని కేవలం రూ. 4,499లకి సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే రూ. 9000 వస్తాయి. ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి వెంటనే త్వరపడండి. 


వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీ స్పెసిఫికేషన్లు:
# 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సల్స్ 
# 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz


Also Read: మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్.. మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ!


Alos Read: CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook