Flipkart Smart TV Offers: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 23 (బుధవారం) నుంచి ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ సేల్ ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు జరగనుంది. ఈ సేల్ లో భారీ తగ్గింపుతో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీ డీల్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా 23 వేల రూపాయల విలువైన Acer స్మార్ట్ టీవీని ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.800 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3D సౌండ్‌తో కలిగిన స్మార్ట్ టీవీ


Acer బౌండ్ లెస్ సిరీస్ స్మార్ట్ టీవీ (32 అంగుళాలు) మార్కెట్లో రూ. 22,990 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ రూపంలో దానిపై 43 శాతం డిస్కౌంట్ ఉంది. దీంతో ఈ తగ్గింపు తర్వాత రూ. 12,999కు ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై అనేక బ్యాంకుల ఆఫర్లు కూడా వర్తిస్తాయి. 
ఈ కొనుగోలులో మీరు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగిస్తే.. మీకు 10 శాతం తగ్గింపు అంటే అత్యధికంగా రూ. 1,235 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో Acer స్మార్ట్ టీవీ ధర రూ. 11,764కు చేరుతుంది. 


అయితే Acer Boundless Series 80 cm (32 inch) HD Ready LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని రూ. 800 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? అందుకోసమే ఫ్లిప్ కార్ట్ లో మీకు మరో ఆఫర్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే క్రమంలో మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా.. మీ టీవీ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 11 వరకు ఆదా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ను మీరు పూర్తిగా పొందినట్లైతే.. Acer బౌండ్ లెస్ సిరీస్ 32 Inch హెచ్ డీ టీవీని రూ. 764లకే కొనుగోలు చేయవచ్చు. 
Acer బౌండ్ లెస్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు!


1) డిస్ ప్లే - 32-అంగుళాల, LED HD 


2) పిక్సెల్ రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్


3) రిఫ్రెష్ రేట్ - 60Hz 


4) సౌండ్ అవుట్ పుట్ - 24W, 3D డాల్బీ సౌండ్ సదుపాయం 


5) Netflix, Amazon Prime వీడియో, YouTube వంటి యాప్‌లను ఉపయోగించుకునే సదుపాయం కూడా ఉంది.  


Also Read: Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.49 లకే శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ కొనేయండి!


Also Read: Google Maps ద్వారా ఇంట్లో కూర్చొని రోజుకు రూ.3,700 సంపాదించవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook