FDI in India: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. తొలి నాలుగు నెలల్లోనే 62 శాతం అభివృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(Foreign Direct Investments)తలుపులు తెరిచిన తరువాత ఆశించిన ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021-22కు సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. దీని ప్రకారం తొలి నాలుగు నెలల్లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 62 శాతం అభివృద్ధి కన్పించింది. గత ఏడాది ఇదే సమయానికి 16.92 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వస్తే..ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్లు వచ్చాయి. అటు ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కూడా 112 శాతం పెరుగదల కన్పించింది. గత ఏడాది ఇదే సమయానికి ఎఫ్‌డీఐ ఈక్వీటీల్లో(FDI Equity)9.61 బిలియన్ డాలర్లుంటే..ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్లు చేరాయి.


ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతం ఎఫ్‌డీఐలతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలో 18 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐలు కర్ణాటకలో అత్యధికంగా వచ్చాయి.రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఎఫ్‌డీఐ ఈక్వీటీల్లో టాప్ 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఘండ్, తెలంగాణ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్యకాలంలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఘండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలు తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఏపీకు 2 వేల 577 కోట్ల ఎఫ్‌డీఐలు(FDI) సమకూరాయి. 


Also read: Bank Accounts close: అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని సులభంగా క్లోజ్‌ చేసుకోండి ఇలా...డీ లింక్ చేయడం మర్చిపోకండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook