Citroen New Car: సిట్రోయెన్ నుంచి మరో కొత్త కారు, హోండీ సిటీ, వెర్నాలను ఢీ కొట్టేందుకేనా
Citroen Car: ప్రముఖ ఫ్రెంచ్ కారు కంపెనీ సిట్రోయెన్ నుంచి మరో అద్భుతమైన కారు లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్న హోండా సిటీ, వెర్నాలను తలదన్నవచ్చని తెలుస్తుండటంతో ఈ కారుపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Citroen New Car: భారతీయ కార్ మార్కెట్‌లో ఫ్రెంచ్ కారు కంపెనీ సిట్రోయెన్ సీ5తో ఎంట్రీ ఇచ్చి హల్‌చల్ రేపుతోంది. ఇండియన్ మార్కెట్‌పై కన్నేసిన సిట్రోయెన్ కంపెనీ ఒకదాని తరువాత మరొక కార్లు ప్రవేశపెడుతూ ఇతర కంపెనీల్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు త్వరలో మరో సరికొత్త మోడల్ కారుతో హల్‌చల్ చేసేందుకు సిద్ధమౌతోంది.
ఫ్రెంచ్ కారు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ప్రీమియం ఎస్‌యూవీతో 2021లో భారతీయ మార్కెట్‌లో అడుగెట్టింది. ఆ తరువాత సీ3 హ్యాచ్‌బ్యాక్, ఇందులోనే ఎలక్ట్రిక్ వేరియంట్ ఇసీ3 లాంచ్ చేసి మరింతగా మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ తరువాత 2023 సెకండ్ హాఫ్‌లో హ్యుండయ్ క్రెటాను ఢీ కొట్టేందుకు సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ లాంచ్ చేసేందుకు సన్నద్ధంగా ఉంది. సిట్రోయెన్ కంపెనీకు యూరప్ మినహాయిస్తే ఇండియా అతిపెద్ద మార్కెట్ కావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సిట్రోయెన్ దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్ కూడా విస్తృతం చేయనుంది.
ఈ క్రమంలో సిట్రోయెన్ నుంచి అప్‌డేట్ వెలువడింది. 2024లో మరో కొత్త కారు లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ కారు మోడల్ పేరు, ఇతర వివరాల్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సిట్రోయెన్ సి3ఎక్స్ క్రాస్ ఓవర్ సెడాన్ కావచ్చని అంచనా. ఇటీవల బెంగళూరులో టెస్టింగ్ సందర్భంగా ఈ కారు కన్పించింది. సిట్రోయెన్ సి3ఎక్స్ సెడాన్‌లో సి3 హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 110 పీఎస్ పవర్, 190 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. సెడాన్‌లో మెరుగైన సామర్ధ్యం కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేయవచ్చు. ఇందులో మేన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధర దాదాపుగా 10 లక్షలుంటుందని అంచనా.
ఇండియన్ కార్ మార్కెట్‌లో ఇప్పటికే హ్యుండయ్ వెర్నా,హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ వేగన్ వర్చూస్ వంటి మిడ్‌సైజ్ సెడాన్‌కు పోటీ ఇవ్వనుంది. అయితే హోండా సిటీకు పోటీ ఇవ్వడం అంత సులభం కాదు. మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో హోండా సిటీ స్థానం ఇప్పటికీ బలంగా ఉంది. ఇండియన్ మార్కెట్‌లో హోండా సిటీ చాలాకాలంగా పాతుకుపోయి ఉంది. హోండా సిటీ అత్యంత నమ్మకమైన సెడాన్ అనడంలో ఆశ్చర్యమేం లేదు. బహుశా అందుకే హోండా సిటీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు హ్యుండయ్ వెర్నా కూడా అంతే. స్కోడా స్లోవియా, వోక్స్‌వేగన్ వర్చూస్ కూడా దాదాపుగా ఇదే పరిస్థితి.
Also read: IT Refund: ఐటీ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా, ఎప్పుుడొస్తుందంటే
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook