LPG Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి! వినియోగదారులకు చుక్కలే!!
Commercial LPG cylinder prices hiked by RS.105: మార్చి నెలకు గాను కమర్షియల్ గ్యాస్ (19 కేజీల) ధరను రూ. 105 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Gas Cylinder Prices hiked in March 2022: అందరూ ఊహించనట్లుగానే మార్చి నెలకు గాను గ్యాస్ సిలిండర్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ (19 కేజీల) ధరను రూ. 105 మేర పెంచాయి. కొత్త రేట్లు ఈరోజు (మార్చి 1) నుంచే అమలులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2012కు చేరింది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయన్న విషయం తెలిసిందే.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (19 కేజీలు) ధర (రూ. 105 మేర)ను మాత్రమే పెంచాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) ధర మాత్రం మార్చి నెలకు గాను నిలకడగానే ఉంది. ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి పెంపు లేకపోవడంతో సామాన్యులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇక 5 కేజీల సిలిండర్ ధరను రూ. 27 మేర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.569కు చేరింది.
2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు చూస్తే.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170కి పైగా పెరిగింది. 2021 అక్టోబర్ 1న ఢిల్లీలో రూ.1736గా ఉంది. నవంబర్‌లో రూ.2 వేలకు పెరగగా.. డిసెంబర్‌లో రూ.2,101కు చేరింది. 2022 జనవరి, ఫిబ్రవరిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1907కు తగ్గింది. ఇప్పుడు మళ్లీ రూ.2012కు ఎగబాకింది. వచ్చే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం తెలుస్తోంది.
2021 అక్టోబర్ నెల నుంచి ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ (14.2 కేజీ) ధరలో ఎలాంటి మార్పు లేదు. ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు పెరిగి.. సామాన్యుడిపై కూడా భారం పడనుందట. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలనెలా సిలిండర్ల రేట్లను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. ఏదేమైనా మొత్తానికి గ్యాస్, పెట్రోల్, ఆయిల్ రూపంలో సామాన్య ప్రజలపై పెను భారం పడుతోంది.
Also Read: Gold Rate Today 1 March 2022: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook