Gemopai Ryder SuperMax Electric Scooter: జెమోపై రైడర్ సూపర్‌మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బిజినెస్‌లో నెలకొంటున్న పోటీ కారణంగా.. ఎలక్ట్రిక్ స్కూటర్ అంటేనే కాస్ట్‌లీ వ్యవహారం అనుకునే రోజుల నుంచి.. ఎలక్ట్రిక్ స్కూటరే చీప్ అండ్ బెటర్ అనే పరిస్థితికి రోజులు వచ్చేశాయి. ఇదివరకు లాంచ్ అయిన రైడర్  ఎలక్ట్రిక్ స్కూటర్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ రైడర్ సూపర్‌మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. దీని ఖరీదు కేవలం రూ. 79,999 మాత్రమే. అంటే 80 వేల రూపాయలే అన్నమాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైడర్ సూపర్‌మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ జాజి నియాన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే, ఫ్లోరోసెంట్ యెల్లో వంటి ఆరు రంగుల్లో లభించనుంది. BLDC హబ్ మోటార్ కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.7 KW మ్యాక్సిమమ్ పవర్ ఔట్‌పుట్ డెలివర్ చేస్తుంది. 


రైడర్ సూపర్‌మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే నాన్‌స్టాప్ 100 కిమీ రేంజ్ ఇవ్వగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాక్సిమమ్ స్పీడ్ 60 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.8 kW కెపాసిటీ కలిగిన స్మార్ట్ బ్యాటరీని అమర్చారు. 


జెమోపై కంపెనీకి చెందిన అన్ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ తరహాలోనే ఈ వాహనానికి కూడా జెమోపై మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, స్పీడ్, రేంజ్‌తో పాటు అనేక ఇతర అంశాలను ఎప్పటికప్పుడు ఈ మొబైల్ యాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్‌ని అలర్ట్ చేస్తుంది. 


జెమోపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ కో-ఫౌండర్ అమిత్ రాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, తక్కువ ధరలో లేటెస్ట్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసినట్టు తెలిపారు. మార్చి నెల రెండో వారం నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో కస్టమర్స్‌కి అందుబాటులోకి వస్తాయని అన్నారు. కేవలం రూ. 2,999 చెల్లించి రైడర్ సూపర్‌మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు అని కంపెనీ స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Goat Milk Ice Cream: మేక పాలతో ఐస్ క్రీమ్.. రోజుకు రూ. 10 లక్షలు సంపాదన


ఇది కూడా చదవండి : Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు


ఇది కూడా చదవండి : Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్.. ఎంట్రీ లెవెల్లోనే టాప్ మోడల్ ఫీచర్స్ ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook