Drop Okaya Freedum Li-2 Electric Scooter Price: పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బైక్ ల నుంచి కార్ల వరకు అన్ని ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో గవర్నమెంట్ సబ్సిడీ ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీని కారణంగానే కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకు వస్తున్నాయి. మీరు కూడా మంచి ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? ఇదే సువర్ణ అవకాశంగా భావించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఒకయా (OKAYA) విడుదల చేసిన ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఇదే మొదటి ఎలక్ట్రిక్ బైక్ గా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ OKAYA Freedum LI-2 పేరుతో అందుబాటులో ఉంది. మొదట కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను MRP ధర రూ.95,000కు విక్రయించగా బిగ్ దివాళి సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను రూ. 74,899కే పొందవచ్చు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


అంతేకాకుండా ఈ బైకును ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. దీపావళి సందర్భంగా మీరు ఈ బైకును ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 16,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్స్ పోను ఈ బైకు రూ. 58,899కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు ఫ్లిప్కార్ట్ యొక్క అధికారిక వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.


ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
ఈ OKAYA Freedum LI-2 ఎలక్ట్రిక్ బైక్ ను అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో కంపెనీ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 75 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ స్మార్ట్ బైక్ కి కంపెనీ కేవలం 25 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కావడానికి దాదాపు 5 గంటల పాటు సమయం పడుతుంది. దీంతోపాటు కంపెనీ ఈ బైక్ కి ట్యూబ్ లెస్ టైర్లను అందిస్తోంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook