Free Air Tickets: ఇండియన్ ఎయిర్‌లైన్ గో ఫస్ట్ ప్రయాణికులకు ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణికులకు ఒక్కసారి ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం ఉంటుందని.. అయితే ఈ సదుపాయం కొందరికే లభిస్తుందని గో ఫస్ట్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఎయిర్‌పోర్ట్‌లో గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆ ప్రయాణికులకు కంపెనీ ఉచిత విమాన టిక్కెట్లను ఇవ్వాలని నిర్ణయించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజుల క్రితం గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను విమానాశ్రయంలో వదిలివేసి వెళ్లిన విషయం తెలిసిందే. వీరందరూ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణికులను తీసుకోకుండానే విమానం వెళ్లిపోయింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారు. అయినా విమానం వీరికి ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన జనవరి 9వ తేదీన జరిగింది.


ఈ 55 మంది ప్రయాణికులందరు 4 గంటల పాటు నిరీక్షించి.. మరో విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఈ విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గో ఫస్ట్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ సంఘటన తర్వాత మొత్తం 55 మంది ప్రయాణికులకు ఒక ఉచిత టిక్కెట్‌ను ఇస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. ఈ ప్రయాణికులందరూ దేశంలో ఎక్కడికైనా ఒకసారి ఉచితంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 12 నెలల్లో ఈ ప్రయాణికులు దేశంలోని ఏ నగరానికైనా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు కూడా చెప్పింది. అంతేకాకుండా సంఘటనకు కారణమైన విమానంలోని సిబ్బంది అందరినీ తాత్కలికంగా తొలగించారు. 


విమానం వెళ్లిపోవడంతో బెంగుళూరు ఎయిర్‌పోర్టులో నాలుగు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించారు. మరో విమానంలో పంపినా.. ఢిల్లీ వెళ్లిన ప్రయాణికులు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై గ్రౌండ్ స్టాఫ్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఎయిర్‌లైన్స్‌కు పొరపాటు జరిగిందని తెలియడంతో.. విమానాశ్రయంలో వదిలిపెట్టిన ప్రయాణికులను నాలుగు గంటల తర్వాత మరో విమానంలో ఢిల్లీకి పంపించారు.


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Khammam Politics: తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ.. పొంగులేటి దారెటు..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి