Goats on Rent: గ్రామాల్లో పంటలు పండించే రైతులు పశువులను కూడా పెంచుతుంటారు. ఆవులు, గేదెలతో పాటు కొందరు మేకలను కూడా పెంచుతుంటారు. అయితే వాటి మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్లి వదిలేస్తారు. అలా పొలాల్లో అవి గడ్డిని తినేస్తాయి. అయితే గడ్డి మేయడం కూడా వ్యాపారమే అని ఎప్పుడైనా ఆలోచించారా? అది తెలుసుకోవాలంటే మీరు కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొలాల్లో గడ్డి మేయడానికి మేకలు కొనండి!


సాధారణంగా ఇంటి ముందు లేదా పెరట్లో గడ్డిని కత్తిరించడానికి యంత్రాన్ని ఉపయోగించడాన్ని మీరు చూసే ఉంటారు. కానీ, బ్రిటన్ లోని సౌత్ వేల్స్ కుటుంబం మాత్రం గడ్డిని కత్తిరించేందుకు మేకలను అద్దెకు ఇస్తుంది. 


ఏదైనా ఇంట్లో లేదా పొలంలో గడ్డిని కత్తిరించేందుకు మేకలను ఉపయోగించడం ద్వారా వాటికి ఆహారంతో పాటు గడ్డిని క్లీన్ చేసినట్లు అవుతుంది. అలా మేకలతో గడ్డిని మేపినందుకు గానూ.. మేకల యజమానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సౌత్ వేల్స్‌లోని కార్మార్థెన్‌షైర్‌లో ఓ కుటుంబం 200 కంటే ఎక్కువ మేకలను కలిగి ఉన్నారు. గడ్డిని కోసేందుకు వీటిని అద్దెకు ఇస్తున్నారు. 


రోజుకు ఎనిమిది పౌండ్ల కంటే ఎక్కువ ఎండుగట్టిని తినడం వల్ల మేకలు బలిష్టంగా ఉంటాయని డాన్, రిచర్డ్ అనే వ్యక్తులు మూడేళ్ల క్రితమే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. 10 పౌండ్లు అంటే సుమారు రూ. 962 చెల్లించి ఓ మేకను వారం రోజుల పాటు అద్దెకు తీసుకోవచ్చు. ఇలా మేకలను అద్దెకు ఇస్తూ ఆ కుటుంబం నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తోంది.   


Also Read: Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!


Also Read: iPhone SE 3 Offers: రూ.29,900 ధరకే Apple iPhone SE 3 స్మార్ట్ ఫోన్ ను కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.