March 21st 2022 Gold and Silver Prices In Hyderabad: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధ కారణంగా బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది. ఓ సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే గతవారం రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. శనివారం బంగారం ధర స్వల్పంగా పెరగగా.. ఆదివారం తగ్గింది. ఇక సోమవారం (మార్చి 21) పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారం, 24 క్యారెట్ల ధర నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.68,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,420 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.72,300లుగా కొనసాగుతోంది.


Also Read: Today Horoscope March 21 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనం లభిస్తుంది!!


Also Read: Imran Khan: భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. భారత విదేశాంగ పాలసీకి పాక్ ప్రధాని కితాబు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook