Today Horoscope March 21 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనం లభిస్తుంది!!

March 21 2022, Daily Horoscope. సింహం, కుంభ రాశుల వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశులవారికి అనుకోని ధనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 08:09 AM IST
  • March 21 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి అనుకోని ధనం లభిస్తుంది
Today Horoscope March 21 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనం లభిస్తుంది!!

Today Horoscope March 21 2022: మేషం ( Aries): ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గా ధ్యానం శుభప్రదం.

వృషభం (Taurus): శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సన్నిహితుల సహకారం లబిస్తుంది. వేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.

మిథునం (Gemini): మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య విషయాలకు సంబంధించి కుటుంబసభ్యులను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని పూర్తి కావస్తుంది. ప్రయాణ సూచన ఉంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

కర్కాటకం (Cancer): ఈరోజు ఉత్సాహంగా పని చేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం (Leo): చేపట్టేపనుల్లో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక అంశాలలో లాభాలు పొందుతారు. అనుకోని ధనం ఉంది. కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

కన్య (Virgo): తలపెట్టిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబంతో హాయిగా గడుపుతారు. శివ స్తోత్రం చదివితే మంచిది.

తుల (Libra): శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు శుభవార్త. ప్రయాణాల్లో జాగ్రత్త. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం (Scorpio): ప్రయత్నం చేస్తే ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

ధనస్సు (Sagittarius): శుభకాలం నడుస్తోంది. మీ ప్రతిభకు, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మంచిది.

మకరం (Capricorn): కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది

కుంభం  (Aquarius): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. కొన్ని పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అనుకోని ధనం చేతికందుతుంది. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మీనం (Pisces): ఉత్సాహంగా ముందుకు సాగితే ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర దోషం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!

Also Read: NTR on remake: తండ్రి సినిమా రీమేక్​కు ఓకే చెప్పిన ఎన్టీఆర్​.. ఆ డైలాగ్​ ఉండాల్సిందేనట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News