Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పు వచ్చింది. వరుసగా నాలుగవరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలకు అనుగుణంగా బంగారం ధర మారుతుంటుంది. గత నాలుగురోజులుగా బంగారం ధర(Gold Price) స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Rate) పది గ్రాముల ధర 47 వేల 260 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 560 రూపాయలకు చేరింది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 780 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 780 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 390 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 49 వేల 510 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 110 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 210 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate)22 క్యారెట్ల 10 గ్రాముల ధర 45 వేల 110 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 210 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 110 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 210 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక వెండి ధరలో మాత్రం ఏ మార్పు లేదు. దేశంలో కిలో వెండి 61 వేల 2 వందల రూపాయలుగా ఉంది. 


Also read: Google Top Search: 2021లో గూగుల్ టాప్ సెర్చ్ వ్యక్తులెవరో తెలుసా, జాబితా విడుదల చేసిన గూగుల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook