Google Top Search: 2021లో గూగుల్ టాప్ సెర్చ్ వ్యక్తులెవరో తెలుసా, జాబితా విడుదల చేసిన గూగుల్

Google Top Search: నిత్య జీవితంలో గూగుల్ ఒక భాగమైపోయింది. తెలియని విషయాన్ని తెలుసుకునేందుకు లేదా ఏదైనా జరిగినప్పుడు వెంటనే గూగుల్ సెర్చ్ వినియోగిస్తుంటాం. ఒక్కోసారి ఘటనల గురించి లేదా వ్యక్తుల గురించి శోధిస్తుంటాం. మరి ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2021, 07:01 AM IST
  • 2021 టాప్ సెర్చ్ వ్యక్తుల జాబితా విడుదల చేసిన గూగుల్
  • ఎలాన్ మస్క్ తరువాత మిగిలిన అందరూ భారతీయులే
  • నీరజ్ చోప్రా గూగుల్ టాప్ సెర్చ్‌లో అగ్రస్థానంలో
Google Top Search: 2021లో గూగుల్ టాప్ సెర్చ్ వ్యక్తులెవరో తెలుసా, జాబితా విడుదల చేసిన గూగుల్

Google Top Search: నిత్య జీవితంలో గూగుల్ ఒక భాగమైపోయింది. తెలియని విషయాన్ని తెలుసుకునేందుకు లేదా ఏదైనా జరిగినప్పుడు వెంటనే గూగుల్ సెర్చ్ వినియోగిస్తుంటాం. ఒక్కోసారి ఘటనల గురించి లేదా వ్యక్తుల గురించి శోధిస్తుంటాం. మరి ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ నూటికి 70-80 మంది ఏదో ఒక విషయానికి సంబంధించి గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కావచ్చు లేదా ఎవరి గురించైనా వివరాలు తెలుసుకునేందుకు కావచ్చు. పని ఏదైనా శోధించేది, వినియోగించేది గూగుల్ సెర్చ్‌నే. అలా ఈ ఏడాది అంటే 2021లో గూగుల్ టాప్ సెర్చ్‌లో(Google Top Search) విభిన్న రంగాలకు స్థానం లభించింది. ఇందులో క్రీడారంగానికి చెందినవారు ముగ్గురుండటం విశేషం. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా నుంచి వ్యాపారరంగంలో ఎలాన్ మస్క్ వరకూ ఉన్నారు. 

నీరజ్ చోప్రా : ఈ ఏడాది అంటే 2021లో గూగుల్ టాప్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచిన వ్యక్తి నీరజ్ చోప్రా(Niraj Chopra). ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించినపెట్టిన వీరుడు. జావెలిన్ త్రో విభాగంలో ఇండియా తొలిసారిగా స్వర్ణపతకం సాధించింది ఈసారి మాత్రమే. నీరజ్ చోప్రా గురించి అత్యధికంగా గూగుల్ సెర్చ్ రికార్డైంది. 

ఆర్యన్ ఖాన్ : నీరజ్ చోప్రా తరువాత రెండవ స్థానంలో నిలిచింది షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ మధ్యనే జరిగనా అత్యధికంగా సెర్చ్ చేయడంతో రెండవస్థానంలో నిలిచాడు. డ్రగ్స్ ఆరోపణల కేసులో అరెస్టై...కొద్దిరోజులు ముంబైలోని ఆర్ధర్ జైళ్లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఆర్యన్ గురించి ఎక్కువగా సెర్చ్ జరిగింది. 

షెహనాజ్ గిల్ : నటి, మోడల్ అయిన షెహనాజ్ గిల్ గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచింది. సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ సపోర్ట్‌తో టాప్ సెర్చర్‌గా నిలిచింది. ఆమె అభిమానుల్లో ఆమె గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువసార్లు సెర్చ్ జరిగింది. 

రాజ్ కుంద్రా : ఇక బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా టాప్ సెర్చర్‌లో ఒకడిగా నిలిచాడు. బ్లూ ఫిల్మ్ రాకెట్‌లో ఇతని పేరు రావడంతో ఒక్కసారిగా సంచలనమైంది. అప్పటి వరకూ రాజ్ కుంద్రా అంటే పెద్గగా ఎవరికీ తెలియదు. కేవలం శిల్పా శెట్టి భర్తగా మాత్రమే సుపరిచితం. అయితే బ్లూ ఫిల్మ్ రాకెట్‌తో గూగుల్ టాప్ సెర్చర్‌లో నిలిచాడు. 

ఎలాన్ మస్క్ : ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్  అధినేత ఎలాన్ మస్క్(Elon Musk). కంపెనీ షేర్లు ఆకాశానికి చేరుకోవడంతో టాప్ బిలియనీర్‌గా నిలిచిన వ్యక్తి. గూగుల్ టాప్ సెర్చ్‌లో నిలిచారు. 

విక్కీ కౌశల్ : బాలీవుడ్ అప్ కమింగ్ నటుడైన విక్కీ కౌశల్ ఒక్కసారిగా వార్తల్లో నిలవడంతో గూగుల్ టాప్ సెర్చర్‌గా నిలిచాడు. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను వివాహమాడటంతో పెద్ద సంచలనంగా మారింది. డిసెంబర్ నెలలో ఈ మధ్యనే విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ వివాహం జరిగింది.

పీవీ సింధు : ఇక ఇండియాకు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవి సింధు(PV Sindhu). ఇండియాకు రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిపెట్టిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. గూగుల్ టాప్ సెర్చర్‌గా నిలిచింది. 

భజరంగ్ పూనియా : నీరజ్ చోప్రా, పీవి సింధూలతో పాటు గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచిన మరో క్రీడాకారుడు భజరంగ్ పూనియా. ఇండియన్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించాడు. 

Also read: Omicron scar: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు- కర్ణాటక, నాగ్​పూర్​లో గుర్తింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News