Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పు వస్తోంది. కొనుగోలు చేసేముందు గత వారం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండనుందో తెలుసుకోవాలి. నవరాత్రికి ముందు బంగారం, వెండి ధరల్లో వచ్చే మార్పులు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకుంటే..కచ్చితందా ఈ వార్త పరిశీలించాల్సిందే. కొనుగోలు కంటే ముందు గత వారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, రానున్న రోజుల్లో బంగారం ధరల్లో తగ్గుదల ఉంటుందా పెరుగుతుందా అనేది పరిశీలించాలి. మరోవైపు వెండి ధరల పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాలి. 


ఇండియన్ బులియన్ ఎండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ అంటే ఐబీజేఏ ప్రకారం ఈ వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49, 320 రూపాయలుంది. శుక్రవారం నాడు 49,432 రూపాయలుంది. అంటే గత వారం 112 రూపాయలు పెరిగింది.సెప్టెంబర్ 19, 2022న పది గ్రాముల బంగారం ధర 49,320 రూపాయలుంటే..23 సెప్టెంబర్ నాటికి 49, 432 రూపాయలకు పెరిగింది. మధ్యలో అంటే సెప్టెంబర్ 21న అత్యధికంగా 49, 606 రూపాయలకు చేరుకుంది. 22వ తేదీన కూడా పది గ్రాముల బంగారం ధర 49,894 రూపాయలుంది. 


ఇక వెండి ధర కూడా తగ్గుతోంది. కిలో వెండి 56,354 రూపాయల్నించి తగ్గుతూ వచ్చి 56,100 రూపాయలకు చేరుకుంది. వారంలో 254 రూపాయలు తగ్గింది. వెండి కూడా సెప్టెంబర్ 21, 22 తేదీల్లో పెరిగింది. 21వ తేదీన 56,667 రూపాయలకు చేరుకుంది. 


బంగారం కొనుగోలు చేసేముందు కచ్చితంగా హాల్‌మార్క్ చూసే కొనాలి. బంగారం నాణ్యతను చెక్ చేసేందుకు ప్రభుత్వ యాప్ BIS Care app ద్వారా ప్యూరిటీ చెక్ చేయవచ్చు. బంగారం ధరను ఇంట్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు. 8955664433 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.


Also read: Multibagger stock: 3 వేల పెట్టుబడితో 19 లక్షల రూపాయలు లాభాలు, ఆ కంపెనీ షేర్ ఫలితం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook