12th March 2022 Gold and Silver Rates Today: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై పడింది. అటు బ్యారెల్ ధర, ఇటు తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగానే పడింది. బంగారం ధరలు ఏకంగా ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 52 వేలు దాటేసింది. అయితే గత 2-3 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి. ఇక శనివారం (మార్చి 12) మాత్రం స్థిరంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటితో (మార్చి 11) పోల్చితే ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. మార్చి 12న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580లుగా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200గా ఉంది. మార్చి 11న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ. 52,580గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 తగ్గి రూ. 48,200గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,570గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,520 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం పెరింది. నిన్నటితో పోల్చితే రూ. 500 పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,600లుగా ఉంది. 


Also Read: Horoscope Today March 12 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!


Also Read: Radhe Shyam Collections: కలెక్షన్లలో రాధేశ్యామ్​ రికార్డు- మొదటి రోజు ఎంతంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook