Gold ATM: హైరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. ప్రపంచంలోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎం
Gold ATM in Hyderabad: ఏటీఎం సెంటర్ కి వెళ్లి క్యాష్ డ్రా చేసుకున్నట్టుగానే ఇకపై గోల్డ్ ఏటీఎం కేంద్రానికి వెళ్లి గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయొచ్చు.
Gold ATM in Hyderabad: ఇప్పటి వరకు మీరు కరెన్సీ నోట్లను డిస్పెన్స్ చేసే ఏటీఎం మెషిన్స్‌ని మాత్రమే చూశారు కదా.. కానీ హైదరాబాద్‌లో కొత్తగా గోల్డ్ ఏటీఎం కూడా వచ్చేసింది. ఇది మన దేశంలోనే కాదు... ప్రపంచంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మెషిన్‌గా ఆ ఏటీఎం బిజినెస్ నిర్వాహకులు చెబుతున్నారు. గోల్డ్ జువెలరీ తయారు చేసే గోల్డ్ సిక్కా అనే కంపెనీ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ అనే మరో సంస్థతో కలిసి ఈ గోల్డ్ ఏటీఎం బిజినెస్ కి తెరతీసింది. కస్టమర్స్ తమ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో ఈ గోల్డ్ ఏటీఎంలలో గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. డబ్బులు ఎలాగైతే విత్ డ్రా చేసుకుంటామో అలాగే కార్డు ద్వారా పేమెంట్ చేసి బంగారు నాణేలు కొనుగోలు చేయవచ్చన్నమాట.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం 5 కిలోల వరకు వివిధ పరిమాణాల్లో ఉండే గోల్డ్ కాయిన్స్ ఈ ఏటీఎంలో స్టోర్ చేసి ఉంటాయి. గోల్డ్ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మొత్తం 8 రకాల పరిమాణాలలో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. కస్టమర్స్ తమకు అవసమైన పరిమాణంలో గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది.
హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం ఎక్కడ ఉంది ?
ఇప్పుడు చాలామందిలో మెదిలే తొలి సందేహం హైదరాబాద్‌లో ఈ గోల్డ్ ఏటీఎం మెషిన్ ఎక్కడుంది అనే కదా.. అక్కడికే వస్తున్నాం. బేగంపేటలోని అశోక్ రఘుపతి ఛాంబర్స్ అనే కమెర్షియల్ కాంప్లెక్సులోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ గోల్డ్ ఏటీఎంని ఏర్పాటు చేశారు. చూపరులను గోల్డ్ ఏటీఎం విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ గోల్డ్ ఏటీఎం డిస్పెన్స్ చేసే గోల్డ్ కాయిన్స్ 24 క్యారట్ల స్వచ్ఛమైన గోల్డ్. ఈ గోల్డ్ కాయిన్స్ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా బిఐఎస్ 999 హాల్ మార్క్ కూడా ఉంటుంది. ఈ ఏటీఎం మెషిన్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఏ రోజుకు ఆ రోజు తాజా ధరలను కూడా మెషిన్ అప్ డేట్ చేస్తుంది. పైగా ధరలు, టాక్స్ విషయంలోనూ ఎలాంటి హెచ్చు, తగ్గులకు ఆస్కారం లేకుండా ఈ గోల్డ్ ఏటీఎం మెషిన్ పక్కా క్లారిటీతో వ్యవహరించి ఏటీఎం స్క్రీన్ పై వివరాలు చూపిస్తుంది.
రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మరో నాలుగు గోల్డ్ కాయిన్ ఏటీఎం మెషిన్స్ స్థాపించాలి అని ప్రణాళికలు రచిస్తున్నట్టు గోల్డ్ సిక్కా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ తెలిపారు. అందులో ఒకటి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కాగా మరొకటి ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. మరో రెండింటిలో ఒక ఏటీఎం అమీర్ పేటలో కాగా మరొకటి కూకట్ పల్లిలో ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇప్పటికే బంగారు తెలంగాణ అనే పేరు ఉండటంతో తమ వ్యాపారాన్ని విస్తరించే విషయంలో తెలంగాణపైనే దృష్టిసారించినట్టు ప్రతాప్ తెలిపారు. ఆ తరువాత తమ తొలి ప్రాధాన్యత సౌతిండియాకే ఉంటుందని. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల గోల్డ్ ఏటీఎం కేంద్రాలు ( ఏటీఎం కొత్త రూల్స్ ) ఏర్పాటు చేసే విధంగా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయని ప్రతాప్ వెల్లడించారు.
Also Read : New Cars Prices Increasing: కొత్తగా కారు కొంటున్నారా ? ఐతే ఇది మీకోసమే
Also Read : Best 5G Phones Under Rs 20,000: 20వేల లోపే లభించే చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్
Also Read : Buying TV, Cars, Fridges: ఇప్పుడు టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook