Best 5G Phones Under Rs 20,000: 20వేల లోపే లభించే చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్

Cheap and Best 5G Phones: ఇండియాలో 5G నెట్‌వర్క్ రాకతో 5G స్మార్ట్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు గత రెండు, మూడేళ్ల నుంచే దేశంలో 5G ఫోన్లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. దీనికితోడు 5G నెట్ వర్క్ కూడా అందుబాటులోకి రావడంతో ఈ 5G ఫోన్లకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. 

Written by - Pavan | Last Updated : Dec 1, 2022, 07:53 PM IST
  • 5G నెట్వర్క్ రాకతో పెరిగిన 5G ఫోన్ల వినియోగం
  • రూ. 20 వేల లోపే లభించే 5జి ఫోన్ల జాబితా
  • ఏయే కంపెనీలో ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయంటే..
Best 5G Phones Under Rs 20,000: 20వేల లోపే లభించే చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్స్

Cheap & Best 5G Phones: దేశంలో ఇటీవలే 5G నెట్‌వర్క్ రావడంతో 5G స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే 5G నెట్‌వర్క్ ఇటీవలే వచ్చినప్పటికీ.. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు గత రెండు, మూడేళ్ల ముందు నుంచే ఇండియాలో 5G ఫోన్లను తయారు చేసి అమ్ముతున్నాయి. అప్పటి నుంచే ఈ 5G ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. అయితే, తాజాగా దేశంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్స్ 5జి నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకురావడంతో ఆ నెట్‌వర్క్ సేవలు అందిపుచ్చుకోవాలని అనుకునేవారు, అలాగే కొత్తగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారు 5G ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20 వేల కంటే తక్కువ ధరలో లభించే చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్లపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.

రెడ్ మి 11 ప్రైమ్ 5G ఫోన్: తక్కువ ధరలో 5G ఫోన్‌ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌లో రెడ్ మి 11 ప్రైమ్ 5G ఫోన్ కూడా ఒకటి. 6.58 అంగుళాల 90Hz ఎల్సీడీ స్క్రీన్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పని చేసే ఈ 5G ఫోన్ ధర రూ. 13,999 నుంచే ప్రారంభమై ఒక్కో వేరియంట్ ఒక్కో ధర పలుకుతోంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్: 5G ఫోన్లలో డిమాండ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లో వన్ ప్లస్ బ్రాండ్‌కి భారీ డిమాండ్ ఉంది. ఇదే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 18,999 గా ఉంది. స్నాప్ డ్రాగాన్ 695 చిప్‌సెట్ సహాయంతో పని చేసే ఈ 5G ఫోన్‌కి 6.59 ఇంచుల స్మార్ట్ డిస్‌ప్లేను అమర్చారు.

ఐకూ జడ్6 5G ఫోన్: వివో స్మార్ట్ ఫోన్ కంపెనీకే చెందిన ఐకూ నుంచి వచ్చిన మరో 5G స్మార్ట్ ఫోన్ ఐకూ జడ్6. స్నాప్ డ్రాగాన్ 695 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ అమేజాన్‌లో కేవలం రూ. 15 వేలకే అందుబాటులో ఉంది. 6.58 ఇంచుల 120Hz ఐపిఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. 

పోకో ఎక్స్ 4 ప్రో: 5G ఫోన్లలో అందుబాటులో ఉన్న మీడియం క్లాస్ ఫోన్లలో పోకో ఎక్స్ 4 ప్రో కూడా ఒకటి. స్నాప్ డ్రాగాన్ 695 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌కి 6.67 అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను అమర్చారు. ఈ ఫోన్ ధర రూ. 16,999 నుంచి ప్రారంభం అవుతుంది.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. శాంసంగ్ గెలాక్సీ M33 ఫోన్. శాంసంగ్ సొంతంగా డెవలప్ చేసిన ఎక్సినాస్ 1280 చిప్‌సెట్ సహాయంతో పని చేసే ఈ 5G ఫోన్‌కి 6.6 ఇంచుల ఎల్సీడీ స్క్రీన్ అమర్చారు. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర రూ. 16,999 గా ఉంది.

Also Read : Flipkart Offers: వావ్.. రూ. 24 వేల Samsung Galaxy F23 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17 వేలకే.. లిమిటెడ్ అఫర్

Also Read : Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే

Also Read : Buying TV, Cars, Fridges: ఇప్పుడు టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News