Gold Hallmarking: గోల్డ్ జ్యువెల్లరీ అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని జారీ చేసింది. బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. రేపట్నించి కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central government) తీసుకున్న కీలక నిర్ణయం రేపట్నించి అమల్లోకి రానుంది. అది హాల్‌మార్కింగ్. ఇప్పటి వరకూ ఆప్షనల్‌గా ఉన్న ఈ హాల్‌మార్కింగ్ ఇకపై మ్యాండేటరీ కానుంది. బంగారు ఆభరణాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి చేసింది. బంగారం స్వచ్ఛతకు ధృవీకరణ హాల్‌మార్కింగ్. క్వాలిటీ, క్వాంటిటీ రెండింటి విషయంలో హాల్‌మార్కింగ్ అనేది ఓ ధృవీకరణ. వాస్తవానికి 2021 జనవరి 15 వతేదీ గడువు తేదీ ఉండేది. కరోనా సంక్రమణ(Corona Spread) నేపధ్యంలో జూన్ 1 వరకూ కేంద్ర ప్రభుత్వం గడువిచ్చింది. తరువాత గడువును మరోసారి పెంచుతూ జూన్ 15 వతేదీ వరకూ సమయమిచ్చింది. ఇప్పుడు మరోసారి గడువు పెంచకపోవడంతో రేపట్నించి బంగారు ఆభరణాల అమ్మకాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయింది.


బంగారం కొనుగోలు (Gold Purchase) సమయంలో బంగారం అసలైందా కాదా అనేది గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. హాల్‌మార్కింగ్ (Hallmarking) అనేది బంగారం నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. జూన్ 15 వతేదీ అంటే రేపట్నించి హాల్‌మార్కింగ్ ఉన్న నగల్నే అమ్మాల్సి ఉంటుంది. హాల్‌మార్కింగ్ లేని నగల్ని అమ్మితే చర్యలు తీసుకుంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ సెంటర్‌కు వెళ్లి..బంగారం నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకూ దేశంలో కేవలం 40 శాతం బంగారు ఆభరణాలకే హాల్‌మార్కింగ్ పాటిస్తున్నారు. రేపట్నించి ఇక అందరూ ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే.


Also read: Gold Price In Hyderabad 14th June 2021: కరోనా ప్రభావంతో దిగొచ్చిన బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook