Gold Price today: బంగారం ధరలు మళ్లీ నిరాశ కల్గిస్తున్నాయి. ఓ రోజు తగ్గిందనుకుంటే మరోరోజు పెరిగిపోతోంది. తాజాగా బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ధరలు ఒకేసారి పెరిగి..వినియోగదారులకు అసంతృప్తి కల్గించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు(Gold Price today)రోజుకో రీతిలో ఉంటూ నిరాశ కల్గిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మరోసారి బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధర అమాంతంగా పెరిగింది. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే పది గ్రాముల బంగారం ధర 450 రూపాయల నుంచి 9 వందల రూపాయల వరకూ పెరిగింది. మరోవైపు కొన్ని నగరాల్లో బంగారం ధర పెరుగుద స్వల్పంగా ఉంటే..కొన్ని నగరాల్లో ఎక్కువగా ఉంది. తాజాగా ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Gold Price today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51వేల 550గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో(Mumbai Gold price today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47 వేల 220గా ఉంది. చెన్నైలో(Chennai Gold Price today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 540 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50 వేల 200 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 200 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 260గా ఉంది.


ఇక తెలంగు రాష్ట్రాల్లో ధరల్ని పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో(Hyderabad Gold price today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 200గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల ధర 49 వేల 90గా ఉంది.


Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook