Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?
Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 78, 250కి చేరుకుంది.
Gold And Silver Prices: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యులను అందుకోలేనంత దూరంగా పరుగెడుతోంది. చరిత్రలోనే ఏనాడు లేని విధంగా బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. రూ. 78వేలకు తులం ధర చేరుకుంది. కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్న అనంతరం బంగారం ధర భారీ పెరుగోతుంది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో సైతం బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో ప్రస్తుతం బంగారం తులం ధర రూ. 78,250కి చేరుకుంది. బంగారం ధర రూ. 78వేల మార్కును చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అటు వెండి ధరలు కూడా బంగారం ధరతో పోటీ పడుతోంది. తాజాగా వెండి మరో వెయ్యి రూపాయిలు పెరిగింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కిలో రూ. 94వేల మార్కును చేరుకుంది. అంతర్జాతీయ కమోడిటీ ఎక్స్చేంజీలో బంగారం ఔన్సు 2701 డాలర్లు పలకడం విశేషం. బుధవారం రూ. 3000 పెరిగిన వెండి ధర రూ. 93వేలకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో గోల్డ్ కాంట్రాక్టు అక్టోబర్ డెలివరీ ధర రూ. 162 వ్రుద్ధితో రూ. 77,500లకు చేరుకుంది.
కిలో వెండి డిసెంబర్ లో డెలివరీ ధర రూ. 1034కు పెరిగి రూ. 93,079కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధఱ మరో గరిష్టానికి చేరువలో కొనసాగుతుంది. ఔన్సు వెండి ధర రూ. 2.63 శాతం పెరిగి 32.86 డాలర్లు పలుకుతోంది.
కాగా ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఇన్నాళ్లూ వడ్డీరేట్లు పెంచిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వ్రుద్ధికి ఊతం ఇచ్చే విధంగా వడ్దీ రేట్లను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో బంగారానిరి భారీగా డిమాండ్ ఏర్పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లో సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. డాలరు ధర క్షీణించడం బంగారం ధర పెరగడానికి మరో కారణమని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook