Todays Gold Price: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. సంక్రాంతి వేళ బంగారం ధరలో ఏ మార్పు రాలేదు. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, బులియన్ మార్కెట్ తీరు, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ తీవ్రత వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. గత పది రోజుల్లో బంగారం ధర ఐదు సార్లు పెరగగా, మూడుసార్లు తగ్గింది. రెండు సార్లు మాత్రం స్థిరంగా కొనసాగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర (Gold Price) ఎలా ఉందో తెలుసుకుందాం.


దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi Gold Rate) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 440 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 3 వందలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 980 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 980 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 980 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 980 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సైతం ఇదే ధర కొనసాగుతోంది. 


Also read: December WPI inflation: డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం- తొమ్మిదో నెలా రెండంకెలపైనే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook