December WPI Inflation: డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం- తొమ్మిదో నెలా రెండంకెలపైనే!

December WPI inflation: 2021 డిసెంబర్​లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. అయినప్పటికే రెండంకెలపైనే నమోదైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 09:07 PM IST
  • 2021 డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
  • ఇంధన, విద్యుత్ ధరల్లో తగ్గుదలే కారణం
  • ఆహార పదార్థాల ధరల్లో మాత్రం వృద్ధి
December WPI Inflation: డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం- తొమ్మిదో నెలా రెండంకెలపైనే!

December WPI inflation: హోల్​ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 2021 డిసెంబర్​లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 13.56 శాతంగా నమోదైనట్లు భారత వాణిజ్య విభాగం (WPI inflation in 2021 December) శుక్రవారం ప్రకటించింది.

2021 నవంబర్​లో ఇది 14.23 శాతంగా ఉన్నట్లు (WPI inflation in 2021 November) తెలిపింది. అయినప్పటికీ టోకు ద్రవ్యోల్బణం తొమ్మిదో నెలలోనూ రెండంకెల పైనే నమోదవడం గమనార్హం.

గత ఏడాది మార్చి తర్వాత నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే నమోదవుతుండటం గమనార్హం.

ఇంధన, విద్యుత్ ధరల్లో తగ్గుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు వాణిజ్య విభాగం (Fuel Prices down) వెల్లడించింది.

అయితే 2020 డిసెంబర్​తో పోలిస్తే మాత్రం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 1.95 శాతం అధికంగా ఉన్నట్లు పేర్కొంది.

2020తో పోలిస్తే గత ఏడాది డిసెంబర్​లో.. మినరల్​ ఆయిల్స్​, లోహాలు, ముడి చమురు, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, టెక్స్​టైల్స్​, పేపర్​, పేపర్ ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల టోకు ద్రవ్యోల్బణం కూడా పెరిగినట్లు ప్రభుత్వ (Govt Data on WPI inflation) డేటా పేర్కొంది.

డిసెంబర్​ ద్రవ్యోల్బణం గురించి..

ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్​ 32.30 శాతానికి తగ్గాయి. అదే ఏడాది నవంబర్​లో ఇది 38.81 శాతంగా (Fuel prices Inflation) ఉంది.

తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం గత ఏడాది డిసెంబర్​లో 10.62 శాతంగా నమోదైంది. నవంబర్​లో ఇది 11.92 వద్ద ఉంది.

ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2021 నవంబర్​తో పోలిస్తే.. డిసెంబర్​లో 4.88 శాతం నుంచి 9.56 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 31.56 శాతం (Vegetable prices) పెరిగాయి.

Also read: Stock Market today: వారాంతపు సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Also read: Gold Price Today : దేశీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు.. పూర్తి వివరాలివే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News