Gold Rate: అత్యంత స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి
Gold Rate: పసిడి ధర దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ అతి స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Rate: పసిడి ధర దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ అతి స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. గ్రాముకు రూపాయి చొప్పున బంగారం ధర పెరిగింది. అయితే బంగారం ధరల్లో పెరుగుదల దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. కొన్ని నగరాల్లో ఎక్కువగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీరేట్లు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భౌగోళిక పరిస్థితులు బంగారం ధరల మార్పుకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు(Gold Price) ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Price)10 గ్రాముల 46 వేల 910 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 170 గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర 61 వేల 600 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 510 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 510 గా ఉంది. ఇటు వెండి ధర ఢిల్లీతో సమానంగా ఉంది. ఇక కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 860 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 560 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం 61 వేల 6 వందలుగా స్థిరంగా ఉంది. ఇక బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 గా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల దర 48 వేల 830 రూపాయలుంది. వెండి ధర మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 గా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయులుగా ఉంది.
Also read: Rapido Advt: ర్యాపిడో యాడ్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు, ఇక మళ్లీ షూట్ చేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook