Rapido Advt: టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చుట్టూ వివాదం చుట్టుకుంది. ర్యాపిడో వర్సెస్ తెలంగాణ ఆర్టీసీ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం..
పుష్పతో ప్రేక్షకుల్ని అలరించనున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఈ మధ్యన విభిన్నమైన ప్రకటనలు చేస్తున్నాడు. ఈ మధ్యన అల్లు అర్జున్ చేస్తున్న ర్యాపిడో బైక్ రైడ్ సర్వీసింగ్ యాప్ ప్రకటన వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఈ యాడ్‌తో ర్యాపిడో వర్సెస్ తెలంగాణ ఆర్టీసీ వివాదం రేగింది. ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఎక్కబోతుంటే..రద్దీలో నలిగిపోవడమెందుకు..ర్యాపిడో బుక్ చేసుకుని హాయిగా వెళ్లొచ్చు కదా అని బన్నీ చెబుతాడు. ఇదే ఆ యాడ్ సారాంశం. ఈ యాడ్ ద్వారా ఆర్టీసీ బస్సును చులకన చేసినట్టుందంటూ తెలంగాణ ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్దనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా తక్షణ కర్తవ్యంగా ర్యాపిడో కంపెనీ, అల్లు అర్జున్‌లకు నోటీసులిచ్చారు. యాడ్‌ను తక్షణం ఆపేయాలన్నారు. ఈ యాడ్‌లో ఆర్టీసీని కించపరిచారని..తక్కువ చేసి చూపించారనేది ఆర్టీసీ అభ్యంతరం. అటు హైకోర్టును కూడా ఆశ్రయించింది.
తెలంగాణ ఆర్టీసీ అధికారుల వాదనతో హైకోర్టు (Telangana High Court)సైతం ఏకీభవించింది. ర్యాపిడో యాడ్ ప్రకటన అభ్యంతరకరమని తక్షణం ప్రకటన నిలిపివేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఆర్టీసీ(RTC)నుంచి నోటీసులు అందిన వెంటనే ర్యాపిడో సంస్థ ఆ ప్రకటనను కొద్దిగా మార్చింది. ఆర్టీసీలో ప్రయాణాన్ని వ్యతిరేకించే వ్యాఖ్యను తొలగించింది. ఆర్టీసీ బస్సు మాత్రం అలానే ఉంచింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో మొత్తం తొలగించాల్సి ఉంటుంది. కొత్తగా మరోసారి షూట్ చేసుకోవల్సిందే. అయితే నెగెటివ్ పబ్లిసిటీ ర్యాపిడోకు కలిసొచ్చింది. ర్యాపిడో వర్సెస్ తెలంగాణ ఆర్టీసీ వివాదంతో ర్యాపిడో సంస్థకు(Rapido) ప్రచారం లభించినట్టైంది.
Also read: Nalgonda: ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..రూ.60 లక్షల ఆస్తినష్టం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook