గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) నిన్న దిగొచ్చాయి. నేడు మళ్లీ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,200కు జంప్ అయింది.



 


ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం పెరిగిన బంగారం ధరలు (Gold Price in Delhi) నిన్న దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా కొనసాగుతున్నాయి.  తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,610 వద్ద మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,160గా కొనసాగుతోంది.



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) భారీగా పెరిగాయి. నిన్న వెండి ధర రూ.3,500 మేర పతనం కాగా, తాజాగా రూ.900 మేర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,800కి పుంజుకుంది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe